Vivo Y53s 4G: మీడియాటెక్ ప్రాసెసర్‌తో వివో నుంచి కొత్త ఫోన్..!

|

Jul 09, 2021 | 2:49 PM

మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో వివో నుంచి కొత్త ఫోన్ విడుదలయింది. వివో వై53ఎస్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్..4జీ వర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.

Vivo Y53s 4G: మీడియాటెక్ ప్రాసెసర్‌తో వివో నుంచి కొత్త ఫోన్..!
Vivo Y53s 4g
Follow us on

Vivo Y53s 4G: మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో వివో నుంచి కొత్త ఫోన్ విడుదలయింది.వివో వై53ఎస్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్..4జీ వర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ వియత్నాంలో విడుదలైంది. త్వరలోనే ఇండియా మార్కెట్‌లోకి తేనున్నట్లు ప్రకటించింది. గతనెలలో చైనాలో విడుదలైన 5జీకి మారుగా 4జీ వెర్షన్‌ని విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. అలాగో 5జీ తో పోల్చితే కొన్ని మార్పులు చేశారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో విడుదల చేశారు. ఈ ఒక్క వేరియంట్ ను మాత్రమే రిలీజ్ చేసింది. దీని ధర 69,99,000 వియత్నాం డాంగ్‌లుగా(మన కరెన్సీలో సుమారు రూ.22,700) ఉంది. బ్లూ పర్పుల్, బ్లాక్ గ్రీన్ రంగుల్లో లభించనుంది.

ఈ ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఓఎస్ పై పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేసి ఫన్‌టచ్ ఓఎస్ ను తయారుచేశారు. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ 60 హెర్ట్జ్‌ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఎక్స్‌ట్రా స్టోరేజ్ కావాలంటే. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో మూడు కెమెరాల సెటప్ అందించారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5, జీపీఎస్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు తో వచ్చింది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు అందించారు. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Also Read:

Realme 5G Smartphones: భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తాం: రియల్‌మీ సీఈఓ మాధవ్‌

Online Transactions: ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి. సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కకండి.