ViVO నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌.. Samsung, Redmiలకు గట్టి పోటీ..

|

Jan 28, 2022 | 8:29 AM

Vivo Y75 5G: Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y75 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది సరసమైన 5G స్మార్ట్‌ఫోన్. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ViVO నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌.. Samsung, Redmiలకు గట్టి పోటీ..
Vivo Y75 5g
Follow us on

Vivo Y75 5G: Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y75 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది సరసమైన 5G స్మార్ట్‌ఫోన్. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్‌ కెమెరా ఇచ్చారు. అలాగే MediaTek Dimension 700 చిప్‌సెట్ అమర్చారు. ఇది 8 GB RAMతో 4 GB ఎక్స్‌టెండ్ ర్యామ్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే కేవలం రూ.13990కి ప్రవేశపెట్టబడిన Vivo Y21A ప్రారంభించిన రెండు రోజుల తర్వాత మార్కెట్‌లోకి వస్తుంది.

Vivo Y75 5G ధర

Vivo Y75 5G ధర రూ. 21990గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo ఇండియా ఈ-స్టోర్, ఇతర భాగస్వామి రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. Vivo 5G మొబైల్ ఫోన్ స్టార్‌లైట్, గ్లోయింగ్ గెలాక్సీ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Samsung సరసమైన 5G ఫోన్‌లైన Galaxy A22 5G, Redmi సరసమైన 5G ఫోన్‌లతో పోటీపడుతుంది.

Vivo Y75 5G ఫీచర్స్‌

Vivo Y75 5G 6.58 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని రిజల్యూషన్ 2408X1080 పిక్సెల్స్. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 700 చిప్‌సెట్ అందుబాటులో ఉంది. ఇది 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంటుంది. ఇది లాక్ చేయబడిన స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి పనిచేస్తుంది.

Vivo Y75 ఇతర ఫీచర్లు

Vivo Y75 మొబైల్ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12లో పని చేస్తుంది. ఇందులో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది గరిష్టంగా 1 TB స్టోరేజ్‌, SD కార్డ్‌ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ 18W టైప్ C ఛార్జింగ్ ఉంటుంది.

vivo y75 కెమెరా సెటప్

Vivo Y75 కెమెరా సెటప్ గురించి మాట్లాడాలంటే ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, ఇది ఎఫ్ / 1.8 ఎపర్చరుతో వస్తుంది. ఇది 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకె కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం కంపెనీ 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. సెల్ఫీ కెమెరా AI ఫేస్ బ్యూటిఫికేషన్‌తో వస్తుంది.

అంతరిక్షంపై ఆసక్తి ఉందా.. ఇస్రోలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..?

చలికాలంలో క్యారెట్ చట్నీ సూపర్.. ఆరోగ్యంతో పాటు అదిరే టేస్ట్‌..ఇంట్లోనే తయారుచేయండి..?

Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వ్యర్థాల పరిస్థితి ఏంటి..?