కొరియన్ పరిశోధకులు డెవలప్ చేసిన వెరైటీ గ్లోవ్స్ చేతికి ధరిస్తే … వింత ఫీల్ కలుగుతుంది. కళ్ళ ముందు కనబడుతున్నదాన్ని చేత్తో ముట్టకుండానే కదిలించవచ్ఛునట.. హ్యాట్సాఫ్ టు రియాల్టీ టెక్నాలజీ ! నిజానికి వీటిని గ్లోవ్స్ అనడంకన్నా.. సిలికాన్ తో కూడిన లైట్ వెయిట్ సిస్టమ్స్ అనవచ్చు. రియలిస్టిక్ వైబ్రేషన్స్ కి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. యూజర్లు వీటిని ఎక్స్ పాండ్ చేయవచ్ఛు . ఎలాగైనా మార్చుకోవచ్చు కూడా.. సాధారణంగా వీడియో గేమ్స్ ఆడే ప్లేయర్లు ఈ గ్లోవ్స్ కాని గ్లోవ్స్ సాయంతో వర్చ్యువల్ ఆబ్జెక్ట్ సైజును, షేపును పెంచవచ్ఛునని, తగ్గించవచ్చునని, అలాగే కంప్యూటర్ జనరేటెడ్ సిమ్యులేషన్స్ తో తమకు అనువైనవిగా చేసుకోవచ్ఛునని అంటున్నారు. కొరియా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రొబోటిసిస్ట్ ఒకరు డిజైన్ చేసిన ఈ వర్చ్యువల్ గ్లోవ్స్ కి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలి భాగాల్లో సెన్సర్స్ ఉంటాయి. వివిధ రకాల వస్తువులను వీటి సాయంతో ‘ ముట్టినట్టు ‘ అనుభూతి చెందవచ్ఛు. గేమ్స్ కోసమే కాకుండా , రిమోట్ సర్జరీకి, హైపర్ -రియలిస్టిక్ రిక్రియేషన్లకు ఈ అద్భుతమైన గ్లోవ్స్ ని వాడే అవకాశం ఉందని, అయితే ఇందుకు మరికొంత కాలం పడుతుందని కొరియన్ రీసెర్చర్లు అంటున్నారు.
గతంలో మన దర్శకధీరుడు రాజమౌళి తన ‘ బాహుబలి ‘ మూవీకోసం ఇలాంటి వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీని, కంప్యూటర్ గ్రాఫిక్స్ ని వాడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.