రోదసి లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు తెలుగు అమ్మాయి బండ్ల శిరీష . కొద్దిగా ఆలస్యమైనప్పటికి వ్యోమనౌక VSS యూనిటీ-22 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ , మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్‌తో కలిసి శిరీష స్పేస్ జర్నీ చేస్తున్నారు. మానవ సహిత వ్యోమనౌక VSS-యూనిటీ-22ను VMS-ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తోంది. 90 నిముషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది. సామాన్యులను రోదసీ లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించారు.
34 ఏళ్ల బండ్డ శిరీష తెలుగు వాళ్లందరికి గర్వకారణంగా నిలిచారు. తొలిసారి అంతరిక్షం లోకి మానవులను తీసుకెళ్లిన ప్రయోగంగా యూనిటీ -22 రికార్డు సృష్టించింది. భారత్ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.
90 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక ప్రయాణం చేసింది. భూ వాతావరణానికి , అంతరిక్షానికి బోర్డర్‌గా భావించే కర్మాన్ రేఖను దాటి ప్రయాణం చేసింది. ఇలా స్పేస్ జర్నీ చేసిన వాళ్లనే వ్యోమగాములుగా పరిగణిస్తారు. కొద్దిసేపు వాళ్లు భారరహిత స్థితికి చేరుకుంటారు.
గుంటూరుకు చెందిన బండ్ల శిరీష కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా పని విధులు నిర్వహిస్తున్నారు. శిరీష 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా వర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు.
ఈ మధ్యే 747 ప్లేన్ ఉపయోగించి అంతరిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్టన్ ఆపరేషన్స్‌ను కూడా చూసుకుంటోంది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు.