Uric Acid Test: యూరిక్ యాసిడ్‌ను గుర్తించడం ఎలా? ఇలా ఇంట్లోనే ఉండి పరీక్షించుకోండి!

|

Sep 19, 2024 | 2:57 PM

యూరిక్ యాసిడ్ రక్తం లేదా మూత్ర నమూనాల ద్వారా పరీక్షిస్తారు. దీని స్థాయిని తనిఖీ చేయడానికి కొన్ని సాధారణ పద్ధతులు, మెషీన్లు ఉన్నాయి. మీరు ఏ పరీక్షా కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే యూరిక్ యాసిడ్‌ని పరీక్షించుకోవచ్చు. ఈ యంత్రాలు చవకైనవి. ఆన్‌లైన్‌లో లేదా మెడికల్ స్టోర్‌లలో సులభంగా లభిస్తాయి. ఇంట్లో సాధారణ సొంతంగా చెకప్‌లు చేసుకోవడానికి..

Uric Acid Test: యూరిక్ యాసిడ్‌ను గుర్తించడం ఎలా? ఇలా ఇంట్లోనే ఉండి పరీక్షించుకోండి!
Follow us on

యూరిక్ యాసిడ్ రక్తం లేదా మూత్ర నమూనాల ద్వారా పరీక్షిస్తారు. దీని స్థాయిని తనిఖీ చేయడానికి కొన్ని సాధారణ పద్ధతులు, మెషీన్లు ఉన్నాయి. మీరు ఏ పరీక్షా కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే యూరిక్ యాసిడ్‌ని పరీక్షించుకోవచ్చు. ఈ యంత్రాలు చవకైనవి. ఆన్‌లైన్‌లో లేదా మెడికల్ స్టోర్‌లలో సులభంగా లభిస్తాయి. ఇంట్లో సాధారణ సొంతంగా చెకప్‌లు చేసుకోవడానికి ఇవి మంచి ఎంపిక. దీని కోసం ఏ మెషీన్‌ను ఉపయోగించాలో తెలుసుకుందాం.

రక్త నమూనా నుండి యూరిక్ యాసిడ్ పరీక్ష:

రక్తం నమూనా తీసుకోవడం ద్వారా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తనిఖీ చేస్తారు. దీని కోసం ఆటో ఎనలైజర్, స్పెక్ట్రోఫోటోమీటర్, బయోకెమిస్ట్రీ ఎనలైజర్ వంటివి ఉపయోగిస్తారు.

  • ఆటో-ఎనలైజర్: ఇది రక్త నమూనాలలో యూరిక్ యాసిడ్ స్థాయిని కొలవడానికి ఆసుపత్రులు, ప్రయోగశాలలలో ఉపయోగిస్తారు. ఇవి ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే ఆటోమేటిక్ యంత్రాలు.
  • స్పెక్ట్రోఫోటోమీటర్: ఈ యంత్రం కాంతి ద్వారా రక్త నమూనాలోని యూరిక్ యాసిడ్ మొత్తాన్ని గుర్తిస్తుంది.
  • బయోకెమిస్ట్రీ ఎనలైజర్: యూరిక్ యాసిడ్‌తో పాటు రక్తంలోని భాగాలను కూడా ఇందులో విశ్లేషిస్తారు. ఇవి ఒకే సమయంలో అనేక రకాల పరీక్షలు చేయగల సామర్థ్యం ఉంటుంది.

మూత్ర పరీక్ష ద్వారా యూరిక్ యాసిడ్ పరీక్ష:

యూరిన్ శాంపిల్ తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిని తనిఖీ చేయవచ్చు. దీని కోసం యూరిన్ డిప్‌స్టిక్ ఎనలైజర్, పోర్టబుల్ యూరిక్ యాసిడ్ ఎనలైజర్, హోమ్ టెస్టింగ్ కిట్‌లు ఉపయోగిస్తారు.

  • యూరిన్ డిప్‌స్టిక్ ఎనలైజర్: ఇది యూరిన్ శాంపిల్‌ని పరీక్షించి యూరిక్ యాసిడ్, ఇతర విషయాల గురించి సమాచారాన్ని అందించే సులభమైన హ్యాండిల్ మెషీన్.
  • పోర్టబుల్ యూరిక్ యాసిడ్ ఎనలైజర్స్: ఇవి మినీ పోర్టబుల్ మెషీన్లు, వీటిని ఇంట్లో లేదా క్లినిక్‌లలో ఉపయోగించవచ్చు. వీటితో మూత్రం లేదా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని సులభంగా గుర్తించవచ్చు.
  • హోమ్ టెస్టింగ్ కిట్‌లు: ఇప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిని ఇంట్లోనే కొలవగలిగే కొన్ని యంత్రాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక చిన్న పోర్టబుల్ యంత్రాన్ని కలిగి ఉంటుంది. దీనిలో మీ వేలి నుండి కొద్ది మొత్తంలో రక్తం తీసుకుని పరీక్షిస్తుంది.

ఇంట్లోనే యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోండి:

యూరిక్ యాసిడ్‌ను మీరే అనేక పోర్టబుల్, సులభంగా ఉపయోగించగల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంట్లో ఉపయోగించవచ్చు. దీని ద్వారా చిన్నపాటి రక్తం నమూనాను తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిని కొలుస్తాయి. వీటిని మీరు Amazon లేదా Flipkart వంటి సైట్‌ల నుండి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. వీటి ధర సుమారు రూ.700 నుంచి రూ.5000 వరకు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి