Smartphones: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ నెలలో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
ఈ నెలలో అందుబాటులోకి వచ్చే స్మార్ట్ ఫోన్స్‌లో మొదటి ఫోన్... గూగుల్ పిక్సెల్ 8 సిరీస్. ఈ సిరీస్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేర్లతో కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 4వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్స్‌ను తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్, పిక్సెల్ 8ప్రోలో 6.7 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు...
వినాయక చవితో భారత్‌లో పండుగ సీజన్ వచ్చేసింది. దసరా, దీపావళి ఇలా వరుసగా పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పండుగ సీజన్స్‌లో కొత్త ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే అటు స్మార్ట్ ఫోన్‌లు కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ కామర్స్ సైట్స్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి అక్టోబర్ నెలలో కొత్తగా కొన్ని స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకీ ఈ నెలలో మార్కెట్లోకి రానున్న ఆ కొత్త స్మార్ట్స్ ఫోన్స్ ఏంటి.? వాటి ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి..
ఈ నెలలో అందుబాటులోకి వచ్చే స్మార్ట్ ఫోన్స్‌లో మొదటి ఫోన్… గూగుల్ పిక్సెల్ 8 సిరీస్. ఈ సిరీస్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేర్లతో కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 4వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్స్‌ను తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్, పిక్సెల్ 8ప్రోలో 6.7 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక టెన్సర్ జీ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లలో టైటాన్ సెక్యూరిటీ ఎం1 చిప్‌ను అందించనున్నారు.
ఇక కెమెరా విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 8లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక గూగుల్ పిక్సెల్ 8ప్రోలో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే గూగుల్ పిక్సెల్ 8లో 4500 ఎంఏహె్ బ్యాటరీ, 8ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.
ఇక ఈ నెలలో అందుబాటులోకి వస్తున్న మరో ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్.. వన్‌ప్లస్ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇదే. అక్టోబర్ 9వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 7,8 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, అలాగే 6.3 ఇంచెస్‌తో కూడిన ఓపెన్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక ఈ రెండు స్క్రీన్స్ రిఫ్రెష్‌రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16 జీబీ ర్యామ్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 4800 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
అక్టోబర్ నెలలో అందుబాటులోకి రానున్న మరో స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్ 13. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ఈ నెలాఖరున మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో రానుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..