పండుగ సీజన్‌కు రెడీ అయిన టీవీఎస్ బైక్స్.. సేఫ్టీ, కనెక్టివిటీతో ఆకట్టుకునే అదనపు హంగులు ఇవే

భారత మార్కెట్లో స్పోర్టీ బైక్స్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని TVS Motor Company తన ప్రముఖ మోడళ్లను అప్‌డేట్ చేసింది. Apache, Ronin సిరీస్‌లలో కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. కొన్ని మోడళ్లలో సేఫ్టీ ఫీచర్లు, మరికొన్నింటిలో కనెక్టివిటీ సదుపాయాలను పెంచింది. కొత్త బైక్స్ డెలివరీలు పండుగ సీజన్‌లో ప్రారంభం కానున్నాయి.

పండుగ సీజన్‌కు రెడీ అయిన టీవీఎస్ బైక్స్.. సేఫ్టీ, కనెక్టివిటీతో ఆకట్టుకునే అదనపు హంగులు ఇవే
Tvs Apache And Ronin New Variants.jpg

Updated on: Sep 21, 2026 | 6:30 AM

బైక్ కొనుగోలుదారులు ఇప్పుడు ఇంజిన్ పనితీరుతో పాటు సాంకేతిక సదుపాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో TVS తన బైక్‌లలో కొత్త ఫీచర్లను జోడించింది. Apache RTR 160 నుంచి ప్రీమియం RTR 310, RR 310 వరకు కొత్త ఎంపికలను తీసుకొచ్చింది. Ronin సిరీస్‌లోనూ భద్రత, కనెక్టివిటీ, సౌకర్యానికి సంబంధించిన మార్పులు చేసింది.

Apache RTR 160 నుంచి RTR 200 4V వరకు..

Apache RTR 160 కొత్త టాప్ వేరియంట్ ధర రూ.1.28 లక్షలు. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, హజార్డ్ లైట్లు, LED ఇండికేటర్లు ఉన్నాయి. నాలుగు రంగుల్లో ఈ వేరియంట్ లభిస్తుంది. Apache RTR 160 4V కొత్త టాప్ వేరియంట్ ధర రూ.1.41 లక్షలు. గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇక RTR 200 4V కొత్త టాప్ వేరియంట్ ధర రూ.1.50 లక్షలు. దీనిలో పై ఫీచర్లతో పాటు అడ్జస్టబుల్ ఫ్రంట్ USD ఫోర్క్‌ను ఇచ్చారు. ఈ మోడల్‌ను దేశంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన 200cc మోటార్‌సైకిల్‌గా కంపెనీ పేర్కొంది.

ప్రీమియం బైక్స్

RTR 310, RR 310లకు ‘బ్లాక్ డైమండ్’ ఎడిషన్‌ను తీసుకొచ్చారు. వీటి ధరలు వరుసగా రూ.2.49 లక్షలు, రూ.2.88 లక్షలు. రెండు మోడళ్లలో కీలెస్ గో సాంకేతికత ఉంది. Ronin సిరీస్‌లోనూ వేరియంట్‌ను బట్టి కొత్త సదుపాయాలు వచ్చాయి. రూ.1.42 లక్షల Ronin Base+లో రెండు కొత్త రంగులతో పాటు డ్యూయల్ ఛానల్ ABS ఉంది. రూ.1.51 లక్షల మిడ్ స్పెక్ వేరియంట్‌లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, కనెక్టెడ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయల్ ఛానల్ ABS, గోల్డ్ ఫినిష్డ్ USD ఫోర్క్ ఉన్నాయి. రూ.1.63 లక్షల టాప్ వేరియంట్‌లో ప్రీమియం సీటు, ట్రాక్షన్ కంట్రోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ లీవర్‌లు లభిస్తాయి. కొత్త బైక్స్ డెలివరీలు పండుగ సీజన్‌లో ప్రారంభం కానున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us