అక్టోబరు 1 నుంచి టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్ ఐడియా సర్వీస్‌ల నాణ్యతను మెరుగుపరిచేందుకు కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. 4G,5G నెట్‌వర్క్‌లను మెరుగుపరచడానికి టెలికాం కంపెనీలకు ట్రాయ్ కఠినమైన నిబంధనలు రూపొందించింది. వీటిని ఉల్లంఘిస్తే కంపెనీలపై భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది కాకుండా, నకిలీ ఎస్‌ఎంఎస్, కాల్స్‌లను అరికట్టాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్? ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర వాటాదారుల డిమాండ్‌పై అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనను అమలు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. అలాగే టెలికాం కంపెనీలు తమ కంప్లైంట్ రిపోర్టును అక్టోబర్ 1వ తేదీలోగా సమర్పించాలని గడువు విధించారు. దీని కోసం టెలికాం రెగ్యులేటర్ గత నెల ఆగస్టు 21న సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశమైంది. ఈ సమావేశంలో ఇన్‌పుట్‌లను నమోదు చేయడానికి గడువు ఆగస్టు 27గా నిర్ణయించింది.
సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఇంకా ఎలాంటి ఇన్‌పుట్ ఫైల్ చేయలేదని ట్రాయ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దాని తేదీ ఇప్పటికే పొడిగించింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం, బెంచ్‌మార్క్ సరిపోలని పక్షంలో టెలికాం ఆపరేటర్లపై భారీ జరిమానా విధించనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ సర్వీస్ నిలిచిపోయే అవకాశం కూడా ఉంది.
ఇది కూడా చదవండి: Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?
వైర్‌లెస్, వైర్‌లైన్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు స్థిరమైన ఫార్మాట్‌లో నివేదికలను సమర్పించాలని టెలికాం రెగ్యులేటర్ కోరింది. త్రైమాసికం ముగిసిన 15 రోజుల్లోగా వారు ఈ నివేదికను సమర్పించాలి. ట్రాయ్ జారీ చేసిన కొత్త నిబంధనల తర్వాత, వైర్‌లెస్, బ్రాడ్‌బ్యాండ్ సేవల నాణ్యతను కొలవడానికి ఈ ఫార్మాట్ ఉపయోగిస్తారు. చాలా మంది వినియోగదారులు కాల్ డ్రాప్స్, సర్వీస్ నాణ్యత గురించి రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని మెరుగుపరిచేందుకు ఈ స్కేల్ తీసుకురానున్నారు.
Press Release No. 64/2024 Chairman, TRAI felicitated TRAI officers involved in finalization of TRAI Recommendations on the ‘Framework for Service Authorisations to be granted Under the Telecommunications Act, 2023’https://t.co/tTRseWfrkz
— TRAI (@TRAI) September 18, 2024
భారీ జరిమానా విధిస్తారు:
క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (QoS) సాధించలేని ఆపరేటర్లపై జరిమానా మొత్తాన్ని కూడా ట్రాయ్ పెంచింది. గతంలో ఈ జరిమానా 50 వేల రూపాయల వరకు ఉండగా, ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలకు పెంచారు. ఇది కాకుండా, రెగ్యులేటర్ వివిధ విషయాలపై పెనాల్టీ మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. సర్వీస్ నాణ్యత సరిపోలకపోతే లేదా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఈ జరిమానా విధిస్తారు.
ఇది కూడా చదవండి: ఓర్నీ.. ఇదేం ఆఫర్రా నాయనా.. కేవలం రూ.179కే Motorola G85 5Gఫోన్.. 99 శాతం క్యాష్ బ్యాక్.. కట్ చేస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి