Redmi: రెడ్‌మి నుంచి ఐదు చౌకైన స్మార్ట్‌ఫోన్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు

|

Oct 15, 2022 | 6:38 PM

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. తక్కువ ధరల్లోనే ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా మొబైల్‌ కంపెనీలు స్మార్ట్‌ ఫోన్‌లను..

Redmi: రెడ్‌మి నుంచి ఐదు చౌకైన స్మార్ట్‌ఫోన్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు
Redmi Mobiles
Follow us on

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. తక్కువ ధరల్లోనే ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా మొబైల్‌ కంపెనీలు స్మార్ట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక భారతీయ మొబైల్ మార్కెట్‌లో రెడ్‌మీతో సహా అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. కానీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో రియల్‌మీ, రెడ్‌మీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రెడ్‌మికి సంబంధించిన చౌకైన స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

  1. Redmi 10Aని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8383కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 4 GB ర్యామ్‌ ఉంది. ఇక స్పెసిఫికేషన్స్‌ ఇందులో 6.53-అంగుళాల డిస్‌ప్లే అందించింది. ఈ మొబైల్‌కు13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
  2. Redmi Note 11 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11,734కి జాబితా చేయబడింది. ఈ ఫోన్ 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని స్పెసిఫికేషన్ .. ఇందులో 6.43 అంగుళాల డిస్‌ప్లే ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
  3. Redmi 9A Sportని రూ. 7505కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు3 GB ర్యామ్‌, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది.
  4. Redmi 10 Primeని రూ. 10499కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. దీనికి 90 Hz రిఫ్రెష్ రేట్‌ల డిస్‌ప్లే ఇవ్వబడింది. ఇది Helio G88 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. అలాగే, 6000 mAh బ్యాటరీ ఇందులో ఇవ్వబడింది.
  5. ఇవి కూడా చదవండి
  6. Redmi 9 Activ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8099కి జాబితా చేయబడింది. ఈ ధరలో 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫోన్‌లో ఎస్‌డీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆక్టాకోర్ హీలియో G35 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 3500 mAh బ్యాటరీతో వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి