Toothpaste: టూత్‌ఫేస్ట్‌ మీ దంతాలకు మాత్రమే కాదు.. ఇలాంటి వాటికి కూడా ఉపయోగించవచ్చు.. క్షణాల్లో మరకలు మాయం

|

Sep 04, 2022 | 8:34 PM

Toothpaste Benefits: టూత్‌పేస్ట్‌ను శుభ్రపరిచే గుణాలు ఉన్న పదార్థాలతో తయారు చేస్తారు. దంతాలను తెల్లగా మార్చే టూత్‌పేస్ట్‌లో ఇటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి..

Toothpaste: టూత్‌ఫేస్ట్‌ మీ దంతాలకు మాత్రమే కాదు.. ఇలాంటి వాటికి కూడా ఉపయోగించవచ్చు.. క్షణాల్లో మరకలు మాయం
Toothpast
Follow us on

Toothpaste Benefits: టూత్‌పేస్ట్‌ను శుభ్రపరిచే గుణాలు ఉన్న పదార్థాలతో తయారు చేస్తారు. దంతాలను తెల్లగా మార్చే టూత్‌పేస్ట్‌లో ఇటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇది కఠినమైన మరకలను కూడా సులభంగా తొలగిస్తుంది. కొన్ని కొన్ని మరకలకు టూత్‌ పేస్ట్‌ను సైతం ఉపయోగిస్తుంటారు. టూత్‌పేస్ట్‌తో ఇంట్లోని ఏ వస్తువులు శుభ్రం చేయవచ్చో తెలుసుకుందాం.

టీ గుర్తులు

చాలా సార్లు ఒక కప్పు టీ ఉంచిన తర్వాత గ్లాస్ టేబుల్‌పై గుర్తులు ఏర్పడతాయి. ఎక్కువసేపు శుభ్రం చేయకపోతే మరకను తొలగించడం కష్టం. టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేసిన తర్వాత టేబుల్‌పై టీ మరకలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఫోన్ కవర్

మన ఫోన్ కవర్‌పై మరకలను తొలగించడం కష్టం. టూత్‌పేస్ట్ ఫోన్ కవర్‌ను శుభ్రం చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. దానిని కవర్‌పై 2-3 నిమిషాలు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కవర్ మీద ఉన్న పసుపు మరకలు కూడా తొలగిపోతాయి.

నగలు నల్లడితే..

వెండి ఆభరణాలు పాతబడితే నల్లగా మారి తుప్పు పట్టాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయవచ్చు. ఈ ట్రిక్ మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాదాలకు ధరించే చీలమండలు తక్కువ సమయంలో నల్లగా మారుతాయి. టూత్‌పేస్ట్ అప్లై చేయడం ద్వారా వాటి మెరుపును తిరిగి పొందవచ్చు. నగలపై టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి 20 నిమిషాల పాటు బ్రష్‌తో శుభ్రం చేస్తే నలుపు మొత్తం పోతుంది.

లిప్‌స్టిక్‌ మరకలు

బట్టలపై లిప్‌స్టిక్ మరకలు పడితే, దానిని తొలగించడం చాలా కష్టం. మనం దానిని తొలగించడానికి ప్రయత్నిస్తే చాలాసార్లు అది ఎక్కువ ప్రదేశాలలో వ్యాపిస్తుంది. మరక ఉన్న ప్రదేశంలో టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి, పేస్ట్‌ను కాసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది శుభ్రం చేస్తే లిప్‌స్టిక్‌ మరక తొలగిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి