Happy Birthday Google: ప్రపంచ సెర్చ్ దిగ్గజం గూగుల్ తన 23వ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటోంది. అందకే ఈ రోజు డూడుల్‌లో 23 ప్రత్యేకంగా కనిపింపించేలా డిజైన్ చేసింది. ఐస్‌క్రీమ్స్, కేక్స్, క్యాండిల్స్‌తో ఈ రోజు డూడుల్ కొత్తగా కనిపిస్తోంది. మన దైనందిన జీవితంలో దీని ప్రాముఖ్యత చాలా పెరిగింది. మెమ్-మెటీరియల్‌లో సెర్చ్ ఇంజిన్‌ను ‘గూగుల్ పాపా’ అని పిలుస్తారు. అదే గూగుల్ తన 23 వ పుట్టినరోజును ఇవాళ అంటే.. సెప్టెంబర్ 27 న జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సెర్చ్ ఇంజిన్ తన హోమ్‌పేజీలో అందమైన డూడుల్‌ను ఏర్పాటు చేసింది.
డూడుల్‌లో కొవ్వొత్తి (గూగుల్‌లో “L” స్థానంలో) దానిపై 23 అని రాసిన డబుల్ టైర్డ్ కేక్ ఉంది. గూగుల్ 4 సెప్టెంబర్ 1998 న ప్రారంభించబడింది. సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ , లారీ పేజ్ సృష్టించారు, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజన్లలో ఇది కూడా ఒకటి.
నెవడాలోని బ్లాక్ రాక్ సిటీలో జరిగిన బర్నింగ్‌మ్యాన్ ఈవెంట్ థీమ్‌తో తొలిసారి 1998లో గూగుల్ డూడుల్‌ని రూపొందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల డూడుల్స్‌ని ఈ సెర్చ్ ఇంజన్ రూపొందించింది. Google ప్రస్తుత CEO సుందర్ పిచాయ్, 24 అక్టోబర్ 2015 న లారీ పేజ్ స్థానంలో ఉన్నారు. ఇంతలో లారీ పేజ్ ఆల్ఫాబెట్ ఇంక్‌లో అదే స్థానాన్ని కలిగి ఉంది. డిసెంబర్ 3, 2019 న పిచాయ్ ఆల్ఫాబెట్ CEO కూడా అయ్యారు. ఆల్ఫాబెట్ ఇంక్ ఇది 2 అక్టోబర్ 2015 న Google పునర్నిర్మాణం ద్వారా సృష్టించబడింది. అదే ఆ తరువాత దాని మాతృ సంస్థగా మారింది.
23 ఏళ్లు పూర్తి..
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు సెర్జే బ్రిన్, లారీపేజ్‌లో ఓ చిన్న స్టార్టప్‌గా 1998లో ప్రారంభించారు. వాస్తవానికి 1998 సెప్టెంబరు 4న గూగుల్ సెర్చ్ ఇంజన్ పుట్టింది. అయితే.. తొలి ఏడేళ్ల పాటు సెప్టెంబరు 4నే గూగుల్ వార్షిక వేడుకులను నిర్వహించే వారు.
ఏడేళ్ల తర్వాత..
1998లో గూగుల్ ప్రారంభించినా తొలి ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పేజ్ వ్యూస్ రావడంతో 2005లో గూగుల్ యానివర్సరీ డేట్‌ని సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 27కి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తేదిని గూగుల్ పుట్టిన రోజుగా జరుపుకుంటోంది.
23కు చాలా స్పెషల్..
గూగుల్ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ జింజర్‌బ్రెడ్, ఐస్‌క్రీం శాండ్‌విచ్, కిట్‌కాట్, లాలిపాప్, మార్ష్‌మాలో, ఓరియో, పై ఇలా ఐస్‌క్రీంల పేర్లతోనే ఉంటాయి. తన థీమ్‌కి తగ్గట్లుగానే తన పుట్టిన రోజు డూడుల్‌ను తయారు చేసింది. ఐస్‌క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్‌ను డూడుల్‌లో పెట్టింది. ఎల్ అక్షరం స్థానంలో క్యాండిల్‌ని ఉంచి వేడుకల ఫ్లేవర్‌ని తెచ్చింది ప్రపంచ సెర్చ్ దిగ్గజం.
Happy 23rd Birthday, @Google! ?
Starting as a prototype in the dorm rooms of two computer scientists, Google now answers billions of queries from users worldwide in 150+ languages ??
Celebrate with a slice of today’s sweet #GoogleDoodle → https://t.co/XkkC09Np2a pic.twitter.com/ELsdD8kb2t
— Google Doodles (@GoogleDoodles) September 27, 2021
ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..
Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..
Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..