Electric Scooters: భారతీయ EV తయారీదారు వార్డ్‌విజార్డ్ కంపెనీ రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వగలవు. Ward Wizard అనేది గుజరాత్ ఆధారిత EV కంపెనీ. జాయ్ ఈ-బైక్ బ్రాండ్ కింద రెండు స్కూటర్లను విడుదల చేసింది. వోల్ఫ్+, జెన్ నెక్స్ట్ నాను+. ఈ రెండు కాకుండా కంపెనీ ఫ్లీట్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెల్ గోను కూడా విడుదల చేసింది.
స్కూటర్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మూడు స్కూటర్లు 3 సంవత్సరాల సమగ్ర వారంటీతో వస్తున్నాయి. బ్రేక్ కొట్టిన ప్రతిసారీ బ్యాటరీ ఛార్జ అయ్యేవిధంగా స్కూటర్లను రూపొందించారు. Wolf+ అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ దీని ధర రూ.1.10 లక్షలు. వోల్ఫ్+ మూడు రంగులలో లభిస్తుంది. మ్యాట్ బ్లాక్, స్టార్‌డస్ట్, డీప్ వైన్. జెన్ నెక్స్ట్ నానో+ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.06 లక్షలు. మిడ్‌నైట్ బ్లాక్, మ్యాట్ వైట్ అనే రెండు రంగుల్లో వస్తుంది. Del Go ధర రూ.1.14 లక్షలు. బ్లాక్, గ్రే అనే రెండు రంగులలో వస్తుంది.
ఈ మూడు స్కూటర్లు స్పీడ్ కంట్రోలర్‌తో జతచేసిన BLDC మోటార్లని పొందుతాయి. NMC బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి 1500W మోటార్‌ను కలిగి ఉంటాయి. ఇది 20 Nm టార్క్, 55 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. రెండు స్కూటర్‌ల బ్యాటరీ 60V35Ahగా ఉంటాయి. స్కూటర్ ఎక్కడైనా ఛార్జ్ చేయడానికి పోర్టబుల్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 4 నుంచి 5 గంటల వరకు వస్తుంది.
ఈ మూడు స్కూటర్లు దాదాపు 100 కి.మీల డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలవని కంపెనీ పేర్కొంది. వోల్ఫ్+ హైవే డ్రైవింగ్, అధిక వేగం కోసం టూరింగ్ డిజైన్‌తో వస్తుంది. Gen Next Nanu+ స్కూటర్ యువ కొనుగోలుదారులను, నగర ప్రయాణికులను ఆకట్టుకుంటుంది.Wolf+ 740 mm ఎత్తు, 1345 mm వీల్‌బేస్‌తో విశాలమైన, పొడవైన సీటును పొందుతుంది. అయితే Gen Next Nanu+ సీట్ ఎత్తు 730 mm, 1325 mm వీల్‌బేస్‌ను పొందుతుంది. దాదాపు ఈ రెండు స్కూటర్ల కొలతలు ఒకే విధంగా ఉంటాయి.