Jio PrePaid Plans: ఎంతకావాలంటే అంత 5జీ డేటా.. ఈ ప్లాన్లతో అన్ లిమిడెట్ వినోదం..

|

Jul 09, 2024 | 6:07 PM

రిలయన్స్ జియో ఇటీవల టారిఫ్‌ను పెంచింది. ప్రీపెయిడ్‌కు సంబంధించి కొన్ని ప్లాన్లను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు కొత్త ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ యాడ్ ఆన్ ప్లాన్లను తీసుకువచ్చింది. అయితే ఇవి విడిగా ఉండవు. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్‌కు యాడ్-ఆన్‌గా ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Jio PrePaid Plans: ఎంతకావాలంటే అంత 5జీ డేటా.. ఈ ప్లాన్లతో అన్ లిమిడెట్ వినోదం..
Jio
Follow us on

రిలయన్స్ జియోకు దేశంలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అపరిమిత డేటా, కాల్స్ తదితర వాటి కోసం వివిధ ప్లాన్ల ను అందిస్తూ అందరికీ చేరువైంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ట్రూ అన్ లిమిటెడ్ 5జీ డేటా పేరుతో మూడు కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

యాడ్-ఆన్ ప్లాన్లు..

రిలయన్స్ జియో ఇటీవల టారిఫ్‌ను పెంచింది. ప్రీపెయిడ్‌కు సంబంధించి కొన్ని ప్లాన్లను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు కొత్త ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ యాడ్ ఆన్ ప్లాన్లను తీసుకువచ్చింది. అయితే ఇవి విడిగా ఉండవు. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్‌కు యాడ్-ఆన్‌గా ఉంటాయి.

అపరిమిత 5జీ డేటా..

రిలయన్స్ జియో తీసుకువచ్చిన కొత్త ప్లాన్లకు వినియోగదారుల ఆదరణ బాగుంటుందని భావిస్తున్నారు. 1 జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్లను రీచార్జి చేసుకున్నయూజర్ల కోసం ఈ బూస్టర్ ప్లాన్లు తీసుకువచ్చింది. అధిక డేటా కోసం రీచార్జి చేసుకునే వారికి వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ప్లాన్ల ధరలను రూ.51, రూ.101, రూ.151 గా నిర్ధారించింది. ఈ ప్లాన్ల ద్వారా అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. సాధారణంగా 2 జీబీ, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ల తీసుకున్న వారికి ఇప్పటికే అపరిమిత 5జీ డేటా అందుతున్న విషయం తెలిసిందే.

5జీ ఫోన్లకు ఉపయోగం..

స్మార్ట్ ఫోన్లు 5జీకి అనుకూలంగా ఉంటే కొత్త ప్లాన్ల ద్వారా అపరిమిత 5జీ డేటా పొందవచ్చు. జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌ కు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అదే 4జీ నెట్ వర్క్ అయితే ఈ ప్లాన్లు పరిమిత డేటాను అందిస్తాయి. వాటి వివరాలు కింద విధంగా ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు..

  • రూ.151 ప్లాన్.. ఈ ప్లాన్ ద్వారా అధిక వేగంతో 9 జీబీ వరకూ 4జీ డేటా లభిస్తుంది. అలాగే 5 జీ మద్దతు ఉన్న ఫోన్లకు అధిక వేగంతో అపరిమిత 5జీ డేటా అందుతుంది.
  • రూ.101 ప్లాన్.. ఈ ప్లాన్ కింద 6 జీబీ వరకూ 4జీ డేటా అందజేస్తారు. అలాగే 5జీ ఫోన్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.
  • రూ.51 ప్లాన్.. దీని కింద 3 జీబీ వరకూ 4జీ డేటా వినియోగదారులకు అందుతుంది. ఒక 5 జీ ఫోన్లు ఉన్న వారికి అపరిమిత 5 జీ డేటా అందిస్తారు.

సమస్యకు పరిష్కారం..

అపరిమిత 5జీని అందించే రూ. 1559, రూ. 359 ప్లాన్ల ను ఇటీవల జియో తొలగించింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఎక్స్ లో తమ నిరసన తెలిపారు. దీంతో కొత్త బూస్టర్ ప్లాన్లు ఆ సమస్యను పరిష్కరిస్తాయని భావిస్తున్నారు. అంటే 1 జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్లు రీచార్జి చేసుకున్న వినియోగదారులు అపరిమిత 5 జీ డేటా కావాలంటే కొత్త బూస్టర్ ప్లాన్లను తీసుకోవాలి. 2 జీబీ, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లలో వినియోగదారులకు మామూలుగానే అపరిమిత 5 జీ డేటా అందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డేటా-ఆన్ ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచాయి. అంటే దాదాపు 25 శాతం వరకూ ఎక్కువ చేశాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..