Best Smartwatch: రూ. 3000లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. టాప్ క్లాస్ ఫీచర్లు.. హెల్త్ ట్రాకర్లు..

అంతేకాక బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ ప్లేయర్ వంటి వన్నీ మణికట్టు నుంచే నిర్వహించే వీలుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటి ధరలు అనువైన బడ్జెట్లోనే ఉంటున్నాయి. రూ. 1000 నుంచే కొన్ని కంపెనీ స్మార్ట్ వాచ్ లు అందిస్తున్నాయి. ఇక మీరు రూ. 3000 ధర వెచ్చిస్తే ఒక స్మార్ట్ ఫోన్ తో చేయగలిగే అన్ని పనులు వాచ్ ద్వారా చేసేయొచ్చు. అలాంటి స్మార్ట్ వాచ్ లను మీకు పరిచేయం చేస్తున్నాం.

Best Smartwatch: రూ. 3000లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. టాప్ క్లాస్ ఫీచర్లు.. హెల్త్ ట్రాకర్లు..
Smartwatch

Edited By: Janardhan Veluru

Updated on: Jan 04, 2024 | 2:42 PM

ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ల తర్వాత అత్యంత ట్రెండీ గ్యాడ్జెట్ ఏదైనా ఉంది అంటే అది స్మార్ట్ వాచ్ మాత్రమే. ఇటీవల కాలంలో దీనికి బాగా డిమాండ్ పెరిగింది. వాటిల్లో ఉండే అత్యాధునిక ఫీచర్లు, ఫిట్ నెస్, హెల్త్ ట్రాకర్లు జనాలను అటువైపు ఆకర్షిస్తున్నాయి. అంతేకాక బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ ప్లేయర్ వంటి వన్నీ మణికట్టు నుంచే నిర్వహించే వీలుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటి ధరలు అనువైన బడ్జెట్లోనే ఉంటున్నాయి. రూ. 1000 నుంచే కొన్ని కంపెనీ స్మార్ట్ వాచ్ లు అందిస్తున్నాయి. ఇక మీరు రూ. 3000 ధర వెచ్చిస్తే ఒక స్మార్ట్ ఫోన్ తో చేయగలిగే అన్ని పనులు వాచ్ ద్వారా చేసేయొచ్చు. అలాంటి సరికొత్త స్మార్ట్ వాచ్ లను మీకు పరిచేయం చేస్తున్నాం. వీటిని మిడిల్ ఏజ్ గ్రూప్ వారు అధికంగా వినియోగిస్తున్నారు. ఆ స్మార్ట్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫైర్ బోల్ట్ క్వాంటమ్ స్మార్ట్ వాచ్..

ఇది రోబోస్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమ్ ఇంటెలెక్చువల్ అపీరియన్స్ ను అందిస్తుంది. దీని ద్వారా ఇయర్ బడ్స్ ను కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ ప్లే చేయొచ్చు. బ్లూటూత్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ 1.28 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. మెటాలిక్ బ్యాండ్ ను కలిగి ఉంటుంది. 100 స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. బ్లూటూత్ వినియోగిస్తే రెండు రోజులు, బ్లూటూత్ లేకుండా వాడితే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1,999గా ఉంది.

నాయిస్ కలర్ ఫిట్ ప్రో4..

అమోల్డ్ స్క్రీన్ తో ఉండే స్మార్ట్ వాచ్ ఇది. బ్లూటూత్ ద్వారా సులువుగా కాల్స్ చేసుకోవచ్చు. విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.78 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉంటుంది. ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే ఉంటుంది. ఫోన్ నోటిఫికేషన్స్ ను వాచ్ లోనే చూడొచ్చు. హార్ట్ రేట్ మోనిటరింగ్, ఫిట్ నెస్ ట్రాకర్లు ఉంటాయి. దీని ధర రూ. 2,999గా ఉంది.

క్రాస్ బీట్స్ అపెక్స్ రీగల్..

ఇది 1.43 అంగుళాలు కలిగిన డిస్ ప్లే ఉంటుంది. దీనిలో యూనిక్ ఫీచర్లు ఉంటాయి. వర్క్ అవుట్ మోడ్స్, ఫాస్ట్ చార్జింగ్, బిల్ట్ ఇన్ గేమ్స్, బ్లూటూత్ కాలింగ్ వంటివి ఉంటాయి. అధిక బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఏడు రోజుల వరకూ రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాయిస్ అసిస్టెంట్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్ ఫార్ కాస్ట్స్ వంటివి ఉంటాయి. దీని ధర రూ. 2,999గా ఉంది.

ఫాస్ట్ ట్రాక్ అడ్వాన్స్ డ్ అల్ట్రా వీయూ హెచ్‌డీ డిస్ ప్లే..

వెడల్పాటి స్క్రీన్ సైజ్, అల్ట్రా బ్రైట్ డిస్ ప్లే కలిగిన ఈ స్మార్ట్ వాచ్ రూ. 3000 బడ్జెట్లో మంచి పనితీరును అందిస్తుంది. 100 అడ్వాన్స్ డ్ స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. స్లీప్ సైకిల్ మోనిటర్ ఉంటుంది. ఏడు రోజుల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లకు సులువుగా కనెక్ట్ అవుతుంది. విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1,999గా ఉంది.

బోట్ అల్టిమా క్రోనోస్..

ఈ స్మార్ట్ వాచ్ లో చాలా హెల్త్ ఫీచర్లు, ఫిట్ నెస్ ట్రాకర్లు ఉంటాయి. కలరీ కౌంట్, స్టెప్స్ కౌంట్ కూడా ఉంటుంది. దీనిలో 700 కస్టమైజ్డ్ యాక్టివీటీలు ఉంటాయి. లైవ్ స్పోర్ట్స్ స్కోర్స్, డీఐవీ వాచ్ ఫేస్ రికగ్నిషన్, బ్లూటూత్ కాలింగ్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 1,999గా ఉండటం లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..