
స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైంది. తెల్లవారింది మొదలు రాత్రి వరకూ ప్రతి పనికీ మనకు అవసరంగా మారింది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. మన ఉపయోగాలు, ప్రయోజనాలకు అనుగుణంగా అనేక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. వీటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడం విశేషం. కేవలం రూ.15 వేల లోపు ధరలో మార్కెట్ లో వివిధ బ్రాండ్ల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో బ్రౌజింగ్, గేమింగ్, మల్టీమీడియా వినియోగం వంటి రోజువారీ పనుల కోసం మంచి కెమెరా నాణ్యత, తగినంత నిల్వ సామర్థ్యం ఉంది. వీటిలోని వివిధ ఫీచర్లు మెరుగైన పనితీరుకు సహకరిస్తాయి. శక్తివంతమైన బ్యాటరీలతో వేగంగా చార్జింగ్ అయ్యే సౌకర్యం కలిగి ఉన్నాయి. మార్కెట్ లో రూ.15 వేల లోపు లభిస్తున్న ఉత్తమ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
క్వాల్కమ్ లాస్ట్ జెన్ ఎంట్రీ లెవల్ చిప్‌సెట్ అయిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ని కలిగి ఉన్న దేశంలోని మొదటి స్మార్ట్ ఫోన్ ఇది. 6.58 అంగుళాల డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లో వస్తుంది. దీనిలో 50 ఎంపీ, 2 ఎంపీ రియల్, 8 జీబీ ఫ్రంట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫన్ టచ్ ఓఎస్ 12 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా చార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. ఈ ఫోన్ రూ. 11,900కు అందుబాటులో ఉంది.
చార్జింగ్ ఎక్కువసేపు ఉండాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఎంపిక. రియల్ మీ నార్జో 60 ఎక్స్ 5జీ ఫోన్ లోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. అంటే కేవలం 30 నిమిషాల్లో దాదాపు 50 శాతం వరకూ చార్జింగ్ చేసుకునే 50 శాతం వరకూ బ్యాటరీని వరకు సులభంగా ఛార్జ్ చేయగలదు. ఈ ఫోన్ లో 6.72 అంగుళాల డైనమిక్ ఆల్ట్రా స్మూత్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 6100 + 5జీ చిప్ సెట్ ప్రాసెసర్, రియల్ మీ యూఐ 4.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 4, 6, 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ తో అందుబాటులోకి వచ్చాయి. ఇక రియర్ కెమెరా 50 ఎంపీ, ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ వస్తున్న ఈ ఫోన్ నాణ్యమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ. మంచి డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర రూ.12,499.
స్టైలిష్ లుక్ ఫోన్ కావాలనుకునే వారిని ఈ ఫోన్ చాలా ఆకర్షిస్తుంది. మార్స్ ఆరెంజ్ కలర్, ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ సూపర్ అని పిస్తాయి. దీనిలో 6.72 అంగుళాల డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6100 + 5జీ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 128, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. 64 ఎంపీ, 2 ఎంపీ రియర్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రియల్ మీ యూఐ 4.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 13 పై పనిచేసే ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రూ.14,999కి అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఓషన్ గ్రీన్, ఐస్ బ్ల్యూ, చార్కోల్ బ్లాక్ రంగులలో ఆకట్టుకుంటోంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ హెచ్ డీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 4, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ ఫోన్ లో 50 ఎంపీ, 20 ఎంపీ రియర్ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డాల్బీ ఎట్మాస్ స్పీకర్లు దీనికి అదనపు ప్రత్యేకత. ఈ ఫోన్ రూ.12,990 ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది.
మెరుగైన డిజైన్, మెరుగైన పనితీరుతో తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ లో 6.6 అంగుళాల డిస్ ప్లే, 4, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఫ్రంట్ 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50 + 2 + 2 రీయర్ కెమెరాలు, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 5ఎన్ఎంమ్ ఎక్సినోస్ ప్రాసెసర్ ఆకట్టుకుంటున్నాయి. మంచి బ్యాటరీ లైఫ్ తో పాటు ఎల్ సీడీ డిస్ ప్లే నాణ్యత చాలా బాగుంది. ఈ ఫోన్ ధర రూ.10,990
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..