Best Smart TVs: రూ. 30వేల లోపు బెస్ట్ 4కే టీవీలు ఇవి.. పెద్ద స్క్రీన్.. ఎక్కువ ఫీచర్లు..

అందరూ అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలు కావాలని కోరుకుంటున్నారు. ఓటీటీ కంటెంట్ కు ఎక్కువగా అలవాటు పడటం, యూట్యూబ్ కూడా ఈ స్మార్ట్ టీవీల్లో ప్లే అవుతుండటంతో అందరూ ఈ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీలను కొనుగోలు చేస్తున్నారు. అది కూడా లార్జ్ సైజ్ టీవీలను కావాలనుకుంటున్నారు. మీరు కూడా అటువంటి ఆలోచనలతో ఉంటే ఈ కథనం మీ కోసమే. మిస్ కాకండి..

Best Smart TVs: రూ. 30వేల లోపు బెస్ట్ 4కే టీవీలు ఇవి.. పెద్ద స్క్రీన్.. ఎక్కువ ఫీచర్లు..
Smart Tv
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 9:45 PM

ఇటీవీల కాలంలో స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. అందరూ అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలు కావాలని కోరుకుంటున్నారు. ఓటీటీ కంటెంట్ కు ఎక్కువగా అలవాటు పడటం, యూట్యూబ్ కూడా ఈ స్మార్ట్ టీవీల్లో ప్లే అవుతుండటంతో అందరూ ఈ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీలను కొనుగోలు చేస్తున్నారు. అది కూడా లార్జ్ సైజ్ టీవీలను కావాలనుకుంటున్నారు. మీరు కూడా అటువంటి ఆలోచనలతో ఉంటే ఈ కథనం మీ కోసమే. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీలు, లార్జ్ సైజ్ లో 4కే యూహెచ్ డీ రిజల్యూషన్ తో ఉన్న వాటిని మీకు అందిస్తున్నాం. వీటి ధర రూ. 30,000 లోపే ఉంటాయి.

నోకియా (50 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ.. ఫీచర్ ప్యాక్డ్ టీవీ ఇది. 4కే రిజల్యూషన్ తో వస్తుంది. దీనితో ప్రాధాన్య ఫీచర్ జపనీస్ ఆడియో మేజర్ ఆన్ క్యో ఆధారితమైన 48 వాట్స్ సౌండ్ సిస్టమ్. 360-డిగ్రీ ఆడియో ప్రొజెక్షన్‌ని అందించడానికి 18వాట్ల ట్వీటర్‌లతో పాటు 30వాట్ల క్వాట్రో ఎక్స్ స్పీకర్‌లను అందిస్తుంది. 3840 x 2160 పిక్సెల్‌లు, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ తో వస్తుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

వన్ ప్లస్ 40టీవీ ఐ1ఎస్.. ఇది వన్‌ప్లస్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ టీవీ. దీనిలో స్మార్ట్ ఫీచర్లు వన్ ప్లస్ ఎకోసిస్టమ్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. ఈ టీవీల్లో యాప్ లు ఆన్ చేసి మళ్లీ వేరే యాప్ లోకి వెళ్లి నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో యాప్ పనిచేయకుండా ఉండేందుకు ‘వన్ క్లిక్ క్లీన్-అప్’ ఫీచర్ ను కలిగి ఉంది. ఈటీవీలో విజువల్స్‌ను బోల్డ్ డైనమిక్ కాంట్రాస్ట్, వైబ్రెంట్ కలర్స్‌ని అందిస్తుంది. గేమర్ల కోసం ఏఎల్ఎల్ఎం(ఆటో తక్కువ లేటెన్సీ మోడ్)ఉంటుంది. దీని ధర రూ. 21,999గా ఉంది.

జియోమీ ఎక్స్ సిరీస్ (43).. 2023లో వచ్చిన ఈ టీవీ లైనప్ లో కంటెంట్ ఫస్ట్ యూఐ విధానాన్ని తీసుకొచ్చారు.గూగుల్ టీవీ, ప్యాచ్ వాల్ ప్లస్ ఆధారంగా పనిచేస్తుంది. జియోమీ బెజెల్ లెస్ స్క్రీన్ ను అందిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఉంటుంది. అంతర్గత వీడియో ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ను కలిగి ఉంది, వివిడ్ పిక్చర్ ఇంజిన్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10కి మద్దతిస్తుంది దీని ధర రూ. 28,999గా ఉంది.

శామ్సంగ్ యూఈ60 క్రిస్టల్ 4కే యూహెచ్ డీ స్మార్ట్ టీవీ.. ఈ 4కే టీవీలోని ముఖ్యాంశాలలో ఒకటి ప్యూర్ కలర్ ఫీచర్. ఇది లీనమయ్యే వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది. శామ్సంగ్ స్మార్ట్ హబ్ కంటెంట్ క్యూరేషన్, డిస్కవరీని ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ టీవీ కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్‌ను కూడా కలిగి ఉంది. ఇది కాంట్రాస్ట్‌ను డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది, ఫలితంగా డెప్త్, కలర్ లలో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. గేమర్ల కోసం ‘మోషన్ ఎక్స్‌లరేటర్’ ఉంది. దీని ధర పలు తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ల తర్వాత రూ. 29,990లకు లభిస్తుంది.

సోనీ బ్రావియా కేడీ-32డబ్ల్యూ920కే.. ఇది హెచ్ డీ రెడీ టీవీ. దీనిలో ఎక్స్ రియాలిటీ ప్రో ఇంజినణ్ ఉంటుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్‌కాస్ట్‌తో సహా అనేక స్మార్ట్ ఫీచర్‌లను ప్యాక్ చేసింది. ఆపిల్ ఎయిర్‌ప్లే ఉంటుంది. దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్ట్ లు, రెండు యూఎస్బీ పోర్టులతో ఉంటుంది. దీని ధర రూ. 25,990గా ఉంది.

ఏసర్ (50 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్ డీ.. దీనిలో 3840 x 2160 పిక్సెల్‌లు / 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4కే స్క్రీన్ ఉంటుంది. మూడు హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి. రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. దీనిలో 5 సౌండ్ మోడ్లు ఉంటాయి. డాల్బీ ఆడియోను అందించేందుకు 30వాట్ల అవుట్ పుట్ ఉంటుంది. దీని ధర రూ. 27,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..