సాధారణంగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు అందరూ ఆలోచించేది బడ్జెట్. ఎవరి రేంజ్ తగినట్లుగా వారు తమకు అనువైన బడ్జెట్‌ను ఫిక్స్ చేసుకొని ఆ పరిధిలో ఫోన్లుకొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో హై ఎండ్ స్మార్ట్ ఫీచర్లతో ఉన్న ఫోన్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. మీరు కనుక రూ. 40,000 వరకూ బడ్జెట్‌కు సిద్ధమైన హై రేంజ్ ఫోన్లు మనకు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో వన్ ప్లస్, షావోమీ, శామ్సంగ్ వంటి బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. హై రిఫ్రెష్ రేట్, డిస్ ప్లే, హై రిజల్యూషన్ కెమెరాలు, 5జీ సేవలు అందులో ఉంటాయి. అలాంటి టాప స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం.
ఈ స్మార్ట్ ఫోన్ 2021లో ప్రారంభమైంది. దీనిలో 6.40అంగుళాల డిస్ ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ నుంచి శక్తి పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ స్మార్ట ఫోన్ వస్తుంది. వెనుకవైపు కెమెరా 50ఎంపీ, 12ఎంపీ, ముందు వైపు 8ఎంపీ సెన్సార్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4614ఎంఏహెచ్ ఉంటుంది. దీని ధర రూ. 39,00గా ఉంటుంది.
2024 జనవరిలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కలర్‌ఓఎస్14.0 ఆధారంగా పనిచేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ద్వారా శక్తిని పొందుతుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ, 8ఎంపీ, 32ఎంపీ కెమెరా సెటప్‌ఉంటుంది. ముందు వైపు 32ఎంపీ కెమెరాతో వస్తుంది. 4600ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది.దీని ధర రూ. 38,999గా ఉంది.
2023 అక్టోబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్ ఎంటర్ అయ్యింది. ఇది 6.74 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 360హెర్జ్ రిఫ్రెష్‌తో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా ఆండ్రాయిడ్13పై ఆధారపడి పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8ప్లస్ జెన్1 మొబైల్ ప్లాట్ ఫారం ద్వారా శక్తిని పొందుతుంది. 8జీబీ, 16జీబీ ర్యామ్ వేరియంట్లు, 128జీబీ, 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, మాక్రో లెన్స్‌తో వస్తుంది. ముందు వైపు 16ఎంపీ ఈఐఎస్ సపోర్టుతో కూడిన కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ 100వాట్ల సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీని ధర రూ. 37,999గా ఉంది.
2024 మార్చిలో లాంచ్ అయిన కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్1 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ సామర్థ్యాలతో అందుబాటులో ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50ఎంపీ, 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 32ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. 4700 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 38,999గా ఉంది.
ఈ ఫోన్ కూడా 2024 జనవరిలోనే లాంచ్ అయ్యింది. ఇది 6.67 అంగుళాలా క్రిస్టల్ రెస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 13, ఎంఐయూఐ 14 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 8జీబీ/12జీబీ ర్యామ్‌తో వస్తుంది. 256జీబీ/512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుక వైపు 200ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరా, ముందు వైపు 16ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ 120వాట్ల హైపర్ చార్జ్ సపోర్టుతో వస్తుంది. దీని ధర రూ. 33,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..