Airtel Recharge Plans: ఒక్క ప్లాన్‌తో ‘అన్‌లిమిటెడ్’ ప్రయోజనాలు.. కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, ఓటీటీ మరెన్నో..

|

Mar 14, 2024 | 9:53 AM

ఎయిర్ టెల్ కంపెనీ దేశంలోనే అతి పెద్ద రెండో నెట్ వర్క్ గా దూసుకుపోతోంది. రిలయన్స్ జియోకు పోటీగా మార్కెట్ లో పరుగులు పెడుతోంది. ఇటీవల ఈ కంపెనీ వినియోగదారుల సంఖ్య 370 మిలియన్లు దాటింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కంపెనీ తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంది. రీచార్జులపై అనేక ఆఫర్లు అందజేస్తుంది.

Airtel Recharge Plans: ఒక్క ప్లాన్‌తో ‘అన్‌లిమిటెడ్’ ప్రయోజనాలు.. కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, ఓటీటీ మరెన్నో..
Airtel
Follow us on

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం ఈ రోజుల్లో కనీస అవసరంగా మారింది. జేబులో ఫోన్ లేకుండా అడుగు ముందుకు పడలేని పరిస్థితి నెలకొంది. నిత్యం మనం చేసే అన్ని పనులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రయాణం సమయంలో దూరాలను తెలుసుకోవడానికి, వస్తువులు కొనుగోలు చేయడానికి, ఏదైనా ఆపద సమయంలో ఆదుకునేందుకు ఫోన్ చాలా అవసరం. మరి ఇంతటి ఉపయోగాలున్నస్మార్ట్ ఫోన్ సక్రమంగా పనిచేయాలంటే దాని నెట్ వర్క్ బాగుండాలి. వివిధ టెలికం కంపెనీలు తమ రీచార్జులపై అనేక ఆపర్లు ప్రకటించాయి. టాక్ టైం, నెట్ బ్యాలెన్స్ తో పాటు అనేక అదనపు ప్రయోజనాలను అందజేస్తున్నాయి.

అదనపు ప్రయోజనాలు..

గతంలో ఫోన్ రీచార్జ్ లు అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలుగా కాలింగ్ సౌకర్యం ఉండేది. దానికి నిమిషానికి కొంత మొత్తం ఖర్చయ్యేది. దానితో పాటు ఎస్ఎమ్ఎస్ లు పంపుకునే వీలు ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రజల అవసరాలు పెరిగాయి. వాటికి అనుగుణంగా రీచార్జ్ ప్లాన్లలో మార్పులు వచ్చాయి. మొదట్లో అన్ లిమిడెట్ కాలింగ్ సౌకర్యం, డేటా లభించడం గొప్పగా ఉండేది. అన్ని కంపెనీలు ఆ సౌకర్యాన్ని కల్పించడంతో ఇప్పుడు ఆ ఆఫర్ సాధారణమైపోయింది. దీంతో వినియోగదారులకు మరింత ఉపయోగపడేలా రీచార్జ్ ప్లాన్ల ను వివిధ కంపెనీలు రూపొందిస్తున్నాయి. కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ లతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల ను ఇస్తున్నాయి.

ఎయిర్ టెల్ కంపెనీ రీచార్జ్ ఆఫర్లు..

ఎయిర్ టెల్ కంపెనీ దేశంలోనే అతి పెద్ద రెండో నెట్ వర్క్ గా దూసుకుపోతోంది. రిలయన్స్ జియోకు పోటీగా మార్కెట్ లో పరుగులు పెడుతోంది. ఇటీవల ఈ కంపెనీ వినియోగదారుల సంఖ్య 370 మిలియన్లు దాటింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కంపెనీ తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంది. రీచార్జులపై అనేక ఆఫర్లు అందజేస్తుంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న ప్లాన్‌లను ప్రారంభించింది. టాక్ టైం, నెట్ బ్యాలెన్స్ తో పాటు వీటిని అదనంగా అందజేస్తుంది. ఆ రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

రూ. 839 రీచార్జ్ ప్లాన్..

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్ టెల్ కంపెనీ రూ.839 రీచార్జ్ ప్లాన్ ను ప్రవేశ పెట్టింది. కస్టమర్ల కు ఎంతో ఉపయోగం కలిగేలా రూపొందించింది. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు వివిధ నెట్ వర్క్ ల ఫోన్లకు కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 168 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు రెండు జీబీ పొందవచ్చు. వీటితో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా పంపించుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు మూడు నెలల సభ్యత్వం కూడా లభిస్తుంది. ఒక్కసారి రూ.839 తో రీచార్జ్ చేసుకుంటే కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్, ఓటీటీ సేవలు కూడా వినియోగదారులకు లభిస్తాయి.

రూ. 1,499 రీచార్జ్ ప్లాన్..

ఎయిర్ టెల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగంగా తీర్చిదిద్దిన మరో రీచార్జ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. అన్ని రోజులూ ఆన్ లిమిడెట్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే 252 జీబీ డేటా అందజేస్తారు. అంటే రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులు రోజూ వంద ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే రూ.1.499 రీచార్జ్ ద్వారా పైఉపయోగాలతో పాటు అపరిమితంగా 5జీ డేటాను పొందే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..