స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో అదే స్థాయిలో స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం కూడా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లల్లో రారాజుగా వెలుగొందే యాపిల్ స్మార్ట్ యాక్ససరీస్ రంగంలో కూడా తన మార్క్‌ను చూపిస్తుంది. స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ పాడ్స్ వంటి ఉత్పత్తులు ఇప్పటికే ప్రజాదరణను పొందాయి. తాజాగా మరో కొత్త లాంచింగ్‌తో యాపిల్ మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం యువత ఎక్కువ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్లను వాడడానికి ఇష్టపడుతున్నారు. అయితే అవి ఎంత బాగున్నా కొన్ని మైనస్‌లు ఆ ఉత్పత్తులను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వీఆర్ సెట్లను వాడే వారు తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో? కూడా తెలియకుండా లీనమవుతూ ఉంటారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చినా లేకపోతే ఏదైనా అపాయకర పరిస్థితులు తలెత్తినా వీఆర్ సెట్లను వాడేవారికి ఆ విషయం తెలియదు. ఇలా అనేక ఇబ్బందుల నుంచి రక్షణగా లేటెస్ట్ ఫీచర్స్‌తో యాపిల్ మరో కొత్త హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విజన్ ప్రో అని పిలిచే దాని కొత్త మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్ , దాని ప్రత్యర్థులతో పోలిస్తే లీనమయ్యే విజన్, సౌండ్, సొగసైన డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. విజన్ ప్రో గురించి మరిన్ని ఆకర్షణీయ వివరాలపై ఓ లుక్కేద్దాం.
విజన్ ప్రో ఉత్పత్తిని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో సోమవారం నిర్వహించిన యాపిల్ కంపెనీ వార్షిక డెవలపర్‌ల కాన్ఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023లో పరిచయం చేశారు. ఈ హెడ్‌సెట్ ఐసైట్ టెక్నాలజీ పని చేస్తుందని యాపిల్ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా విజన్ ప్రోని నలుగురిలో హ్యాపీగా వినియోగించుకునేలా రూపొందించారు. ఐ సైట్ టెక్నాలజీ వినియోగదారులు ఇతర వ్యక్తుల ఉనికిని హెచ్చరించడం ద్వారా వారి సంబంధిత పరిసరాలలో స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఎవరైనా విజన్ ప్రో వినియోగదారుని సంప్రదించినప్పుడు హెడ్‌సెట్ వారిని వినియోగదారుని దృష్టి రంగంలోకి తీసుకువస్తుంది అదే సమయంలో వినియోగదారు కళ్ళను ప్రదర్శిస్తుంది. విజన్ ప్రోతో యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు హెడ్‌సెట్ బాహ్య ప్రదర్శన వినియోగదారు బిజీగా ఉన్నారని లేదా మరేదైనా పరధ్యానంలో ఉన్నట్లు చూపడానికి దృశ్య సూచనలను కూడా ఇస్తుంది. ఈ విజువల్ క్యూ వినియోగదారుడు బ్రౌజ్ చేస్తున్నారా లేదా సినిమా చూస్తున్న మధ్యలో హెచ్చుతగ్గులకు గురవుతుంది. విజన్ ప్రో 2024 ప్రారంభంలో అందుబాటులో ఉంటుందని యాపిల్ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం చూడండి..