Microsoft Bonus: ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌.. ఎంప్లాయిస్‌ కృషికి గుర్తుగా భారీగా బోనస్‌. ఎంతో తెలిస్తే..

|

Jul 09, 2021 | 2:33 PM

Microsoft Bonus: కరోనా మహమ్మారి కారణంగా ఏదో రకంగా ప్రతీ ఒక్కరూ ప్రభావితమయ్యారు. ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డ వారు కొందరైతే.. వ్యాపారాలు నష్టపోయాయి ఆర్థికంగా దెబ్బతిన్న వారు మరికొందరు. ఇలా అన్ని రంగాల్లో...

Microsoft Bonus: ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌.. ఎంప్లాయిస్‌ కృషికి గుర్తుగా భారీగా బోనస్‌. ఎంతో తెలిస్తే..
Microsoft Bonus Employees
Follow us on

Microsoft Bonus: కరోనా మహమ్మారి కారణంగా ఏదో రకంగా ప్రతీ ఒక్కరూ ప్రభావితమయ్యారు. ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డ వారు కొందరైతే.. వ్యాపారాలు నష్టపోయాయి ఆర్థికంగా దెబ్బతిన్న వారు మరికొందరు. ఇలా అన్ని రంగాల్లో కరోనా ప్రభావం చూపింది. ఇక కరోనా బారిన పడడం వల్ల కూడా చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌, అమేజాన్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తూ సర్‌ప్రైజ్‌ చేశాయి. తాజాగా ప్రపంచ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్‌ ప్రకటించింది.

ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి 1500 డాలర్లు.. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1.12 లక్షలను సింగిల్‌ టైం బోనస్‌గా ప్రకటించింది. కరోనా కారణంగా ఆర్థిక సంవత్సరం కష్టంగా గడిచిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్పోరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కంటే కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తిస్తుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. మార్చి నెలకు ముందు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులందరికీ ఈ బోనస్‌ అందించనున్నారు. అయితే మైక్రోసాఫ్ట్‌ అనుబంధంగా పనిచేస్తున్న లింక్టిన్‌, గిట్‌హబ్‌, జెనీమ్యాక్స్‌కు చెందిన ఉద్యోగులు మాత్రం ఈ బోనస్‌కు అర్హులు కాదని సంస్థ తెలిపింది. ఈ బోనస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,75,508 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ బోనస్‌ విలువ సుమారు 200 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ రెండు రోజుల ఆదాయం కంటే తక్కువ కావడం విశేషం. ఇదిలా ఉంటే అంతకు ముందు ఫేస్‌బుక్‌ సుమారు 45 వేల మంది ఉద్యోగులకు ఒక్కొరికి 1000 డాలర్లను బోనస్‌గా ఇవ్వగా, అమేజాన్‌ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు 300 డాలర్లను హాలీడే బోనస్‌గా అంచింది.

Also Read: Zomato: మీరు జోమాటో యాప్‌ వాడుతున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఎలాగంటే..!

Realme 5G Smartphones: భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తాం: రియల్‌మీ సీఈఓ మాధవ్‌

Facebook Thread: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చే పనిలో పడ్డ ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌లో ఉన్న ఆ సదుపాయాన్ని.