ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు భారీ ఫైన్ పడింది. అంతా ఇంత కాదు ఏకంగా 268 మిలియన్ డాలర్లు. గూగుల్‌కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ కాంపిటిషన్ వాచ్ డాగ్ సంస్థ 268 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఆన్లైన్ ప్రకటనల విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు 268 మిలియన్ డాలర్ జరిమానా విధించాలని తెలిపింది. కొన్ని మొబైల్ సైట్లు, యాప్‌లలో గూగుల్ తమ పోటీదారుల ప్రకటనలకు సంబంధించి ఆంక్షలు విధించిందని సదరు వాచ్డాగ్ సంస్థ తెలిపింది. ఆధిపత్య స్థితిలో ఉన్న ఒక సంస్థ ఒక నిర్దిష్ట బాధ్యతకు లోబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది.