Tech Tips: మీ ల్యాప్‌టాప్‌ స్పీడ్‌ తగ్గిపోయిందా? ఇలా చేయండి.. మరింత వేగం!

Tech Tips: కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌పైన అనవసరమైన పైల్స్‌ ఉంచుకోకూడదు. దీని వల్ల కూడా సిప్రోగ్రామ్‌పై లోడ్‌ పడి నెమ్మదిస్తుంటాయి. ల్యాప్‌టాప్‌లో ఎప్పటికప్పుడు క్యాచీఫైళ్లను క్లీయర్‌ చేసుకోవాలి. అలాగే డిలీట్‌ చేసిన ఫైల్‌లు డస్ట్‌బిన్‌లో చేరిపోతుంటాయి. అక్కడి నుంచి కూడా క్లీయర్‌..

Tech Tips: మీ ల్యాప్‌టాప్‌ స్పీడ్‌ తగ్గిపోయిందా? ఇలా చేయండి.. మరింత వేగం!

Updated on: Dec 19, 2025 | 5:31 PM

Tech Tips: ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు స్లో అయిపోతుంటే పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. చికాకు వేస్తుంటుంది. చాలా మందికి ఈ సమస్య వస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు. ఉదయం నుంచి రాత్రి వరకు ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో మునిగి తేలుతుంటారు. దాన్ని సరిచేసుకోవడం మంచిది. లేకుంటే సర్వీస్‌ సెంటర్‌కు తీసుకుపోతే ఖర్చు పెరిగిపోతుంటుంది. కానీ మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే ఇంట్లోనే దీనిని సరి చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

ల్యాప్‌టాప్‌లో చాలా ట్యాబ్‌లను తెరిచి ఉంచవద్దు:

చాలా మంది పని చేసే సౌలభ్యం కోసం ల్యాప్‌టాప్‌లో చాలా వరకు ట్యాబ్‌లను ఓపెన్‌ చేసి ఉంచుతారు. దీని వల్ల మీ ల్యాప్‌టాప్‌ నెమ్మదించే అవకాశం ఉంది. మీరు మీ బ్రౌజర్‌లో ఎన్ని ట్యాబ్‌లను తెరిస్తే, మీ పరికరం ర్యామ్‌ లేదా ప్రాసెసర్ అంత ఒత్తిడికి గురవుతుంటుంది. అలాంటి సమయంలో మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతుంటుంది. దీని వల్ల మీ పనికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. వీలైనంత తక్కువగా కొత్త ట్యాబ్‌లను ఓపెన్‌ చేసి ఉంచుకోకపోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు

ఇవి కూడా చదవండి

ప్రోగ్రామ్‌లను పరిశీలించండి:

కొన్నిసార్లు మీకు తెలియకుండానే ల్యాప్‌టాప్ దాచిన ప్రోగ్రామ్‌లు రన్ అవుతూ ఉంటాయి. ఫలితంగా ల్యాప్‌టాప్ పనిచేయదు. స్లో అవుతుంది. Ctrl+Shift+Escని కలిపి నొక్కడం ద్వారా టాస్క్ మేనేజర్‌కి వెళ్లండి. అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్‌లో ఏయే ప్రోగ్రామ్‌లు అనవసరంగా రన్ అవుతున్నాయో జాబితాను చూస్తే తెలుస్తుంది. మీరు మూసివేయాలనుకుంటున్న ప్రోగ్రామ్‌పై కుడివైపు క్లిక్ చేసి, ఆపై ‘ఎండ్ టాస్క్’పై క్లిక్ చేయండి. ఇలా కొన్ని ట్రిక్కులు పాటించడం వల్ల కంప్యూటర్‌ స్పీడప్‌ అవుతుంటుందని గుర్తించుకోండి.

క్యాచీఫైళ్లను క్లీయర్‌ చేసుకోవాలి:

అలాగే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌పైన అనవసరమైన పైల్స్‌ ఉంచుకోకూడదు. దీని వల్ల కూడా సిప్రోగ్రామ్‌పై లోడ్‌ పడి నెమ్మదిస్తుంటాయి. ల్యాప్‌టాప్‌లో ఎప్పటికప్పుడు క్యాచీఫైళ్లను క్లీయర్‌ చేసుకోవాలి. అలాగే డిలీట్‌ చేసిన ఫైల్‌లు డస్ట్‌బిన్‌లో చేరిపోతుంటాయి. అక్కడి నుంచి కూడా క్లీయర్‌ చేసుకోవడం మంచిది. అలాగే ల్యాప్‌టాప్‌, డెస్క్‌టప్‌లలో వీడియో అవసరం లేకుండా వీడియో ఎడిటింగ్‌ యాప్స్‌ వేసుకోకూడదు. దీని వల్ల కూడా స్లో అవుతుంటుంది.

ఇది కూడా చదవండి: Best Mileage Bikes: దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే.. మార్కెట్లో ఫుల్‌ డిమాండ్‌!

ఇది కూడా చదవండి: Jio Plan: కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. జియోలో సూపర్‌ ప్లాన్‌

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి