AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉందా? వాట్సాప్ కాల్‌లను ఎలా రికార్డ్ చేయాలో చూడండి

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగానే ఆన్‌లైన్‌ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మనకు ఎలాంటి అనుమానం రాకుండా మోసం చేసేస్తున్నారు. ఫేక్‌ లింకులు, పంపిస్తూ ఎదుటి వారిని అట్రక్ట్‌ చేసే మెసేజ్‌లను పంపిస్తూ మోసగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మోసగాళ్లు కొత్త మార్గాలనే అన్వేసిస్తున్నారు. ఈరోజుల్లో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిరోజూ అప్రమత్తంగా ఉండటం చాలా..

Tech Tips: మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉందా? వాట్సాప్ కాల్‌లను ఎలా రికార్డ్ చేయాలో చూడండి
Whatsapp
Subhash Goud
|

Updated on: Mar 10, 2024 | 11:17 AM

Share

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగానే ఆన్‌లైన్‌ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మనకు ఎలాంటి అనుమానం రాకుండా మోసం చేసేస్తున్నారు. ఫేక్‌ లింకులు, పంపిస్తూ ఎదుటి వారిని అట్రక్ట్‌ చేసే మెసేజ్‌లను పంపిస్తూ మోసగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మోసగాళ్లు కొత్త మార్గాలనే అన్వేసిస్తున్నారు. అయితే ఇప్పుడు వాట్సాప్‌ కాల్స్‌ చేసి కూడా కొందరు మోసగిస్తున్నారు. వాట్సాప్‌లో లింక్‌లను పంపడం, వాటిని క్లిక్‌ చేయగానే మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకుల వివరాలన్ని వారికి చేరిపోతున్నాయి. ఈరోజుల్లో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిరోజూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఒక తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితం పెద్ద ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. దీని గురించి తెలుసుకోవడం ముఖ్యం. వాట్సాప్‌లో కాల్ చేయడం లేదా మెసేజ్‌లు పంపడం ద్వారా ఎవరైనా మిమ్మల్ని స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తే, వెంటనే డాక్యుమెంట్‌లతో రిపోర్ట్ చేయండి. కానీ వాట్సాప్‌లో కాల్స్ రికార్డ్ చేయబడవు. అలాంటప్పుడు ఆధారాలు ఎలా వెతకాలి?. దానికి ఒక ఉపాయం కూడా ఉంది.

మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ లో వాయిస్ కాల్స్ ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం.

  • ముందుగా Google Play Storeని ఓపెన్‌ చేసి “Call Recorder: Cube ACR” యాప్ కోసం వెతకండి.
  • ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాప్‌ను తెరవండి.
  • ఇప్పుడు WhatsAppకి వెళ్లి ఎవరికైనా కాల్ చేయండి లేదా ఇన్‌కమింగ్ కాల్‌ని స్వీకరించండి.
  • కాల్ సమయంలో మీరు “క్యూబ్ కాల్” విడ్జెట్‌ని చూస్తారు. మీకు ఇది డిస్‌ప్లేలో కనిపించకుంటే, క్యూబ్ కాల్ యాప్‌ని తెరిచి వాయిస్ కాల్‌ల కోసం “ఫోర్స్ VoIP కాల్” ఎంపికను ఎంచుకోండి.
  • అప్పుడు ఈ యాప్ వాట్సాప్ వాయిస్ కాల్‌ని స్వయంచాలకంగా రికార్డ్ చేస్తుంది.
  • అలా రికార్డ్ చేయబడిన కాల్స్ మీ మొబైల్ అంతర్గత మెమరీలో ఆడియో ఫైల్స్ రూపంలో ఉంటాయి.

జాగ్రత్తపడు:

ఇవి కూడా చదవండి

ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్‌లు మీ ఫోన్‌కి ఎంతవరకు సురక్షితమో అధికారిక సమాచారం లేదు. అలాగే, మీరు ఒకరి ఫోన్ కాల్ రికార్డ్ చేసే ముందు ఆలోచించండి. వారి అనుమతితో రికార్డు చేయడం మంచిది. ఒకరి కాల్‌ని రికార్డ్ చేయడానికి ముందు మీ రాష్ట్ర చట్టపరమైన నియమాలను తెలుసుకోండి. స్కామర్ల విషయంలో సాక్ష్యంగా ఉపయోగించబడేలా కాల్స్ రికార్డ్ చేయబడితే సమస్య లేదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి