
స్మార్ట్‌ఫోన్‌లు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. వాటిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా రూపొందించారు. కానీ కొన్నిసార్లు వినియోగదారులు చేసే తప్పుల కారణంగా మొబైల్ జీవిత కాలం దగ్గర పడుతుంది.మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే ఈ తప్పులను నివారించాలి.
మీ ఫోన్, యాప్‌లను సమయానికి అప్‌డేట్ చేయకపోవడం:
యాప్ డెవలపర్లు, ఫోన్ కంపెనీలు బగ్‌లను పరిష్కరించడానికి, కొత్త ఫీచర్‌లను జోడించడానికి కాలానుగుణంగా అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి. ఈ అప్‌డేట్‌లను విస్మరించకూడదు. అప్‌డేట్‌ల సహాయంతో మీరు కొత్త ఫీచర్లను పొందడమే కాకుండా ఫోన్ భద్రతకు ముప్పు కూడా తగ్గుతుంది.
బలహీనమైన పాస్‌వర్డ్ ఉపయోగించడం:
సాధారణ పాస్‌వర్డ్‌తో మీ ఫోన్ లేదా యాప్ లాక్‌ని అన్‌లాక్ చేయడం సులభం అనిపించవచ్చు. కానీ అది పెద్ద తప్పు కావచ్చు. హ్యాకర్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేయడానికి సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకోవచ్చు. దీని కారణంగా డేటా దొంగతనం జరగడంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది.
అనవసరమైన యాప్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఇది భద్రత, గోప్యతకు అనేక ముప్పులను కలిగిస్తుంది. లోన్ యాప్‌ల విషయంలో స్కామర్లు ఈ అనుమతులను పొందే ఎన్నో రకాల వేధింపులకు పాల్పడుతుండటం తరచూ చూస్తుంటాము.
స్టోరేజీ:
ఫోన్ కొనడానికి ముందు మీ స్టోరేజీ అవసరాలను దృష్టిలో ఉంచుకోండి. ఫోన్‌ను పూర్తి స్టోరేజ్‌తో ఉండటం వల్ల ఇబ్బందిగా మారవచ్చు. ఎలాంటి వీడియోలు తీసేందుకు ఆస్కారం ఉండదు. దీని కారణంగా ఫోన్ నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే ప్రతి యాప్ లోడ్ కావడానికి సమయం పడుతుంది.
ఫోన్ వేడెక్కడం:
ఫోన్ వేడెక్కడం వల్ల దాని పనితీరు దెబ్బతింటుంది. అలాగే బ్యాటరీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఫోన్ వేడెక్కకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను మూసి ఉంచండి. నాణ్యత లేని ఛార్జర్‌ను ఉపయోగించవద్దు.
థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌ల నుండి యాప్ డౌన్‌లోడ్‌లు:
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎల్లప్పుడూ అధికారిక ప్లే స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ సైట్ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసినట్లితే యాప్‌లలో మాల్వేర్ ఉండవచ్చు. ఇది మొబైల్‌కు ప్రమాదకరం. ఇది ఫోన్ పనితీరును నెమ్మదిస్తుంది. డేటాను కూడా దొంగిలిస్తుంది.
ఇది కూడా చదవండి: Gautam Adani House: గౌతమ్ ఆదానీకి విలాసవంతమైన ఇల్లు.. దాని విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి