సుందర్ పిచాయ్.. పరిచయం అక్కరలేని పేరు. మన దేశంలోనే పుట్టి, పెరిగి, ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీ అయిన గూగుల్ కి సీఈఓగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఆదర్శప్రాయం. అంతటి స్థాయికి వెళ్లిన సుందర్ పిచాయ్ లైఫ్ స్టైల్ గురించి అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆయన ఎటువంటి కార్లు వాడతారు? ఫోన్ ఏది వాడతారు? అన్న వాటిపై సాధారణంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. పైగా ఇటీవల గూగుల్ పిక్సల్ ఫోన్లను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఈ క్రమంలో గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ తన సంస్థ నుంచి వచ్చిన గూగుల్ పిక్సల్ ఫోన్లు వాడుతారా? ఆయన చేతిలో ఉండే ఫోన్ ఏంటి? అసలు ఆయనకు ఏ ఫోన్ అంటే ఇష్టం? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చివరి వరకూ చదవండి..
గూగుల్ ఇటీవల తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ ను ఈ నెల తన వార్షిక డెవలపర్‌ల సమావేశంలో ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పిక్సెల్ ఫోల్డ్ మార్కెట్లో ట్రెండీగా మారుతున్నప్పటకీ.. చాలా మంది టెక్ ఔత్సాహికులకు ఒక సందేహం తొలచేస్తుంది? అదేంటంటే గూగుల్ సీఈఓ ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా లేదా? అని. ఇదే ప్రశ్నకు ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల సీఈఓ సమాధానం ఇచ్చారు. తాను చాలా కాలంగా పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను టెస్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. దాంతో పాటు తన ప్రాథమిక స్మార్ట్‌ఫోన్‌గా పిక్సల్ 7 ప్రో ను కలిగి ఉన్నట్లు చెప్పారు. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ, ఐఫోన్ కూడా పలు పరీక్షల కోసం వినియోగిస్తున్నట్లు వివరించారు.
మీరు ఫోల్డ్‌ని ఉపయోగిస్తున్నారా అని అడిగినప్పుడు, సుందర్ పిచాయ్ ఇలా సమాధానమిచ్చారు: “అవును, నేను కొంతకాలంగా ఫోల్డ్ ఫోన్ ను పరీక్షిస్తున్నాను.” అని అన్నారు. అయితే ఆయన సాధారణ ఫోన్‌ను ఉపయోగించేందుకు ఇష్టపడే సందర్భాలు ఉన్నాయని వివరించారు. ప్రయాణంలో ఉన్నప్పుడు.. ప్రయాణాల సమయాల్లో తన ఇమెయిల్‌ను తనిఖీ చేయాలనుకుంటున్నప్పుడు, బిజీ గా ఉన్న సమయంలో సులభంగా వినియోగించుకునేందుకు సాధారణ ఫోన్ ను కూడా వాడతానని చెప్పారు. ఆ సాధారణ ఫోన ఏది అని అడిగినప్పుడు సుందర్ తన సాధారణ ఫోన్ గూగుల్ పిక్సల్ 7 ప్రో అని సమాధానం ఇచ్చారు. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ నుండి కొత్త ఐఫోన్ వరకు అన్నింటిని ఉపయోగిస్తుంటానని అన్నింటిలో వేర్వేరు సిమ్ కార్డులు వినియగిస్తానని చెప్పకొచ్చారు.
గూగుల్ సీఈఓతో యూట్యూబర్ అరుణ్ మైనీ (“Mrwhosetheboss”) చేసిన ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మూడు రోజుల్లోనే 2.5 మిలియన్ల వ్యూస్ ని పొందింది. దీనిపై నెటిజనులు కూడా మంచి లైక్లు, కామెంట్లు ఇస్తున్నారు. మీరూ ఆ ఇంటర్వ్యూను చూడాలనుకొంటున్నారా? అయితే ఇదే ఆ ఇంటర్వ్యూ.. చూసేయండి..
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..