Passwords: పాస్ వర్డ్ మరిచిపోతున్నారా.. ఇకపై పాస్‌వర్డ్‌లే అవసరం లేని టెక్నాలజీ వచ్చేస్తోంది..

|

May 07, 2022 | 12:50 PM

Passwords: మనుషులకు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్ లు పెరిగిపోయాక్ వాటి భద్రతలో వాడే పాస్‌వర్డ్ లు పెరిగిపోయాయి. ప్రతి అప్లికేషన్ కు ఒక పాస్‌వర్డ్ తప్పనిసరిగా మారింది. కానీ..

Passwords: పాస్ వర్డ్ మరిచిపోతున్నారా.. ఇకపై పాస్‌వర్డ్‌లే అవసరం లేని టెక్నాలజీ వచ్చేస్తోంది..
Password
Follow us on

Passwords: మనుషులకు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్ లు పెరిగిపోయాక్ వాటి భద్రతలో వాడే పాస్‌వర్డ్ లు పెరిగిపోయాయి. ప్రతి అప్లికేషన్ కు ఒక పాస్‌వర్డ్ తప్పనిసరిగా మారింది. రోజు వారీ వినియోగించే మెయిల్ ఓపెన్ చేయాలన్నా, సోషల్ మీడియా సైట్లలో లాగిన్ అవ్వాలన్నా, కనీసం షాపింగ్ చేయాలన్నా పాస్వర్డ్ వాడాల్సిందే. ఇలా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, మొబైల్ ఫోన్లలో జరిపే ప్రతి పనికి దాదాపుగా పాస్‌వర్డ్ అవసరంమే. చాలా మంది ఒక్కో దానికి ఒక్కో పాస్‌వర్డ్ పెట్టి మర్చిపోతుంటారు. అవసరమైన సమయంలో దానిని మరిచిపోవటం వల్ల లాగిన్ కాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు, రానున్న కాలంలో అసలు పాస్‌వర్డ్స్ లేని ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ సంస్థలు జతకట్టాయి.

స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, వెబ్ బ్రౌజర్లలో పాస్‌వర్డ్ అవసరం లేకుండా సైన్-ఇన్ చేసుకునేందుకు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఎఫ్‌ఐడీఓ అలయెన్స్‌కు, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్షియానికి కట్టుబడి ఉండనుంది. ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్లపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఐఓఎస్, ఆండ్రాయిల్ మొబైల్ డివైజ్‌లు, సఫారి, క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్స్, విండోస్, మ్యాక్ ఓఎస్ డెస్క్‌టాప్‌లు వంటి పలు ప్లాట్‌ఫామ్‌లపై పాస్‌వర్డ్ అవసరంలేని అథెంటికేషన్‌ను త్వరలోనే తీసుకొస్తున్నట్లు సదరు కంపెనీలు వెల్లడించాయి.

కేవలం పాస్‌వర్డ్ అథెంటికేషన్ వల్లనే అనేక సెక్యూరిటీ తలనొప్పులు ఏర్పడుతున్నాయని ప్రకటనలో ఆపిల్ చెప్పింది. ప్రతి దగ్గర పాస్‌వర్డ్ వాడాల్సి వస్తుండటంతో గుర్తుంచుకోలేక చాలా మంది యూజర్లు అన్ని డివైజ్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను వాడుతున్నారని.. ఇది డేటా దొంగతనాలకు, సెక్యూరిటీ ప్రమాదాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతోన్న సెక్యూరిటీ సమస్యలతో.. ఈ మేజర్ టెక్ కంపెనీలన్నీ సైన్-ఇన్ టెక్నాలజీని రూపొందించేందుకు కలిసికట్టుగా సాగుతున్నాయి. వినియోగదారులకు మరింత వీలుగా ఉండేందుకు కసరత్తు చేస్తోంది.

ఇవీ చదవండి..

Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డు.. దేశంలోనే తొలి సంస్థ

Liquor: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడ తెల్లవారు 3 గంటల వరకు బార్లు ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్..