Eclipses: 2023లో ఎన్ని సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తాయో తెలుసా? ఏయే తేదీల్లో.. భారత్‌లో కనిపిస్తాయా?

|

Nov 23, 2022 | 7:31 AM

2022 సంవత్సరం ముగియడానికి, కొత్త సంవత్సరం 2023 ప్రారంభం కావడానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. రాబోయే సంవత్సరంలో ఏమేమి..

Eclipses: 2023లో ఎన్ని సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తాయో తెలుసా? ఏయే తేదీల్లో.. భారత్‌లో కనిపిస్తాయా?
Eclipses
Follow us on

2022 సంవత్సరం ముగియడానికి, కొత్త సంవత్సరం 2023 ప్రారంభం కావడానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. రాబోయే సంవత్సరంలో ఏమేమి జరుగుతుంటాయని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఏ పండుగ ఎప్పుడు? కొత్త సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి? భారతదేశంలో ఎన్ని గ్రహణాలు కనిపిస్తాయో అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్ర వివరాల ప్రకారం.. 2023 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు, ఎప్పుడు ఏర్పడతాయో తెలుసుకుందాం. వచ్చే ఏడాదిలో వచ్చే భారతదేశంలో 4 గ్రహణాలు సంభవించనున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు.

  1. మొదటి గ్రహణం: 2023లో ఏప్రిల్‌లో తొలి గ్రహణం ఏర్పడనుంది. మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్‌ 20, 2023 గురువారం రోజున ఏర్పడనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 20 ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు.
  2. రెండవ గ్రహణం: 2023 సంవత్సరంలో రెండవ గ్రహణం మే 5, 2023 శుక్రవారం నాడు ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి చంద్రగ్రహణం. రాత్రి 8.45 గంటలకు గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగుస్తుంది.
  3. మూడవ గ్రహణం: 2023 సంవత్సరంలో మూడవ సూర్యగ్రహణం అక్టోబర్ 14న శనివారం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండవ సూర్యగ్రహణం అవుతుంది. తొలి సూర్యగ్రహణం మాదిరిగానే ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా, ఆర్కిటిక్‌లలో కనిపిస్తుంది.
  4. నాలుగో గ్రహణం: చంద్రగ్రహణం 2023 సంవత్సరంలో చివరి గ్రహణం. అక్టోబర్ 29 ఆదివారం నాడు ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఉదయం 1.06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు జ్యోతిష నిపుణులు, శాస్త్రవేత్తల వివరాల ప్రకారం అందించడం జరుగుతుంది. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు)