Smart watches: స్మార్ట్ వాచ్‌లతో మరింత స్మార్ట్.. మదర్స్ డే గిఫ్ట్‌గా ఆర్డర్ చేసేయండి..!
స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపమే అమ్మ. తన పిల్లల ఉన్నతి కోసం ఆమె చేసే త్యాగాలు వెలకట్టలేనవి. కష్టాలు, బాధలు, ఇబ్బందులను తనలో దాచుకుని పిల్లలకు సుఖాలు, ఆనందాన్ని పంచుతుంది. కుటుంబాన్ని చక్కదిద్దడంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడూ తపిస్తూ ఉంటుంది. అందుకునే ప్రతి ఒక్కరి జీవితంలో వారి తల్లి చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె త్యాగానికి గుర్తిగా ఏటా మే 11న మదర్స్ డే జరుపుకొంటారు.

ప్రతి ఒక్కరూ తమ తల్లికి ఏ బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తారు. అయితే అమ్మకు స్మార్ట్ వాచ్ బహుమతిగా ఇస్తే బాగుంటుంది. సమయం చూసుకోవడంతో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లు, వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
ఆపిల్ వాచ్ ఎస్ఈ
మణికట్టుకు అందాన్నివ్వడంతో పాటు నాణ్యమైన పనితీరు అందించడం ఆపిల్ వాచ్ ఎస్ఈ ప్రత్యేకత. దీనిలోని ప్రకాశవంతమైన డిస్ ప్లేతో నోటిఫికేషన్లను చక్కగా చూడవచ్చు. అన్ని పనులను ట్రాక్ చేసుకోవచ్చు. ఫిట్ నెస్ తో పాటు గుండె స్పందన తదితర ఆరోగ్య విషయాలను చెక్ చేసుకోవచ్చు. జీపీఎస్ 40 ఎంఎం వెర్షన్ తో కూడిన బేస్ మోడల్ వాచ్ రూ.24,900 ధరకు అందుబాటులో ఉంది.
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా
ప్రముఖ బ్రాండ్ సామ్సంగ్ నుంచి విడుదలైన గెలాక్సీ వాచ్ అల్ట్రా ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. దీనిలో 1.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 2 జీబీ ర్యామ్, టైటానియం కేస్, నీలమణి క్రిస్టల్ గ్లాస్, ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్, లేటెస్ట్ హెల్త్ ట్రాకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ తో అత్యవసర సైరన్ ను కూడా మోగిస్తుంది. ఈ వాచ్ అసలు ధర రూ.50,999 కాగా.. ప్రస్తుతం ఆన్ లైన్ లో రూ.34,900 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
ఆపిల్ వాచ్ సిరీస్ 10
సమర్థవంతంగా పనిచేసే స్మార్ట్ వాచ్ లలో ఆపిల్ వాచ్ సిరీస్ 10 ముందుంటుంది. దీనిలో ఆల్వేస్ – ఆన్ రెటీనా డిస్ ప్లేలో విజువల్ ను ఏ కోణం నుంచి అయినా వీక్షించొచ్చు. ఎస్10 ఎస్ఐపీ ద్వారా పనితీరు వేగవంతంగా ఉంటుంది. గుండె వేగం, ఈసీజీ, రక్త ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అల్యూమినియం కేసు, స్పోర్ట్ బ్యాండ్ తో కూడిన ఈ వాచ్ బేస్ వేరియంట్ మన దేశంలో రూ.46,900 నుంచి ప్రారంభమవుతుంది.
గార్మిన్ ఇన్స్టింక్ట్ 3
సాహస యాత్రలు, పర్యటనలు చేసే వారికి ఎంతో ఉపయోగపడే గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 వాచ్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. 1.2 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, ధర్మల్, షాక్, నీటి నిరోధకత, కచ్చితమైన ట్రాకింగ్ కోసం మల్టీ బ్రాండ్ జీపీఎస్, రెడ్ లైడ్ మోడ్ తో అంతర్నిర్మిత ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ బాగున్నాయి. గుండె స్పందన రేటు, నిద్ర, పల్స్, ఒత్తిడిని ట్రాకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ నోటిఫికేషన్లు, స్పోర్ట్స్ యాప్ లు అదనపు ప్రత్యేకత. దీని బేస్ వేరియంట్ మన దేశంలో రూ.52,990కి అందుబాటులో ఉంది.
రెడ్ మీ వాచ్ 5 యాక్టివ్
అత్యంత తక్కువ ధరలో బెస్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకునే వారికి రెడ్ మీ వాచ్ 5 యాక్టివ్ మంచి ఎంపిక. దీని ధర కేవలం రూ.2499 మాత్రమే. ఆకట్టుకునే ఫీచర్లు, స్టైలిష్ మెటల్ బాడీతో ఆకట్టుకుంటోంది. దీనిలో 2 అంగుళాల హెచ్ డీ ఎల్సీడీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఇది డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ తో బ్లూటూత్ కాలింగ్ కు మద్దతు ఇస్తుంది. అలాగే గుండె స్పందన రేటు, ఎస్పీవో2, ఒత్తిడి, నిద్రను పర్యవేక్షించుకోవచ్చు. 140కి పైగా వర్కౌంట్ మోడ్ లు, 5 ఏటీఎం నీటి నిరోధకత, 18 రోజుల బ్యాటరీ లైఫ్ బాగున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






