
కొత్తగా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. మార్చి 1 నుంచి కొన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ ధరలు భగ్గుమన్నాయి. ఈ మేరకు ధరలను పెంచుతూ తయారీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే శాంసంగ్, వివో, ఐకూ కంపెనీలు ఆదివారం నుంచి ఫోన్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా నడిచాయి.

చైనా కంపెనీలైన రెడ్ మీ, పోకో కూడా స్మా్ర్ట్ ఫోన్ల ధరలను మార్చి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించేశాయి. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ ధరలన్నీ పెరగడంతో కొనుగోలుదారులకు షాక్ తగిలినట్లయింది. ఈ కంపెనీల ఫోన్ల ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు పెంచాయి.

ఏఐ డేటా సెంటర్ల డిమాండ్, మెమెరీ చిప్‌ల కొరత వల్ల మొబైల్స్ తయారు చేసేందుకు కంపెనీకు ఖర్చు పెరిగింది. దీంతో ఈ ఖర్చును కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. వివో టీ4, ఐక్యూ జడ్ 10 సిరీస్ ఫోన్లపై గరిష్టంగా వేరియెంట్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు ఈ నెల నుంచి పెంచాయి

ఇక శాంసంగ్ ఎఫ్ 17,ఏ 36, ఏ 56 మోడల్ స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల వరకు పెంచింది. ఇక పోకో సీ 75 మోడల్ ఫోన్‌పై రూ.2 వేలు పెంచింది. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియెంట్ ధర రూ.8,499గా ఉండగా.. ఇక నుంచి రూ.10,999కి విక్రయించనున్నారు. ఇక 4జీబీ+128జీబీ వేరియెంట్ ధర కూడా రూ.2 వేలకు పెరిగింది.

ఇక పోకో ఎం7, సీ85 5జీ, పోకో ఎం 7 ప్లస్, పోకో ఎఫ్ 7 మోడళ్ల ఫోన్ల ధరలు కూడా గరిష్టంగా రూ.2 వేల వరకు పెరగనున్నాయి. మెమెరీ చిప్‌ల కొరతనే ధరల పెంపునకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ రూపంలో భారం పడనుంది.