ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ. మైలేజ్.. మార్కెట్లోకి అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా..?
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే ప్రతి ఒక్కరినీ వేధించే ఒకే ఒక్క ప్రశ్న.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది? అని. సరిగ్గా ఈ రేం టెన్షన్‌కు పక్కాగా చెక్ పెడు మర్కెట్లోకి వస్తుంది సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల మైండ్ బ్లోయింగ్ రేంజ్‌తో ఈవీ మార్కెట్‌ను షేక్ చేయడానికి ఇది రెడీ అయింది.

భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో మైలేజ్ విషయంలో ఉన్న టెన్షన్‌కు చెక్ పెట్టేందుకు సరికొత్త సరిహద్దులు దాటుతూ వచ్చేసింది సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల అద్భుతమైన బ్యాటరీ కెపాసిటీతో ఈ స్కూటర్ ఇండియన్ ఈవీ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. కేవలం నగర ప్రయాణాలకే కాకుండా పెట్రోల్ బండ్ల లాగా లాంగ్ రైడ్స్‌కు కూడా పక్కాగా సెట్ అయ్యేలా రూపొందించిన ఈ ప్రీమియం స్కూటర్ స్పెసిఫికేషన్స్, స్మార్ట్ ఫీచర్లు, ధర వివరాలు
పవర్‌ఫుల్ బ్యాటరీ – అదిరిపోయే స్పీడ్
ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా సరికొత్త టెక్నాలజీని వాడారు.
బ్యాటరీ కెపాసిటీ: ఇందులో 6.5 kWh సామర్థ్యం గల భారీ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది ఐపీ67 (IP67) వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే వర్షంలో తడిసినా ధూళి వల్లనైనా బ్యాటరీకి ఎలాంటి ముప్పు ఉండదు.
భారీ రేంజ్: ఈ పవర్‌ఫుల్ బ్యాటరీ వల్ల సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్లోని టూ-వీలర్ సెగ్మెంట్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రేంజ్ అని చెప్పాలి.
పవర్‌ఫుల్ మోటార్ – స్పీడ్: ఇందులో 8.8 kW PMSM ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 115 కిమీ వేగంతో దూసుకెళ్లగలదు.
ఫాస్ట్ ఛార్జింగ్: ఈ స్కూటర్ బ్యాటరీ 0 నుండి 80 శాతం ఛార్జ్ కావడానికి కేవలం 2 గంటల 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
అల్ట్రా స్మార్ట్ ఫీచర్స్ – రైడింగ్ మోడ్స్
టెక్నాలజీ పరంగా ఈ స్కూటర్ ఒక స్మార్ట్‌ఫోన్‌ను తలపిస్తుంది. ఇందులో 7 ఇంచెస్ భారీ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
స్మార్ట్ కనెక్టివిటీ: బ్లూటూత్, ఇన్ బిల్ట్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవ్వడానికి ఓటీఏ సపోర్ట్ కూడా ఉంది.
6 రైడింగ్ మోడ్స్: రైడర్ తన మూడ్, రోడ్డు పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవడానికి ఇందులో ఏకంగా 6 రకాల రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అవి: Eco X, Eco, Ride, Air, Sonic, Sonic X.
భద్రత – కంఫర్ట్ విషయంలో నెక్స్ట్ లెవెల్
రైడర్ సేఫ్టీ కోసం కార్లలో ఉండే లాంటి కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఇందులో జోడించారు.
సేఫ్టీ ఫీచర్స్: ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రెజెనరేటివ్ బ్రేకింగ్, టీపీఎమ్ఎస్, ఫాల్ డిటెక్షన్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్ ఉన్నాయి.
సస్పెన్షన్ – బ్రేకింగ్: స్మూత్ రైడింగ్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్, మెరుగైన బ్రేకింగ్ కోసం ముందు, వెనుక చక్రాలకు డ్యూయల్ డిస్క్ బ్రేకులను ఇచ్చారు.
స్టోరేజ్ – టైర్స్: లగేజీ కోసం 26 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. అలాగే ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్‌తో కూడిన ట్యూబ్‌లెస్ టైర్లు రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
ధర ఎంత..?
భారత మార్కెట్లో ఇంతటి భారీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2,34,999/- గా నిర్ణయించారు. ధర ఎక్కువగా అనిపించినప్పటికీ, రోజువారీ పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే, దీనికున్న 400 కిమీ భారీ రేంజ్ కారణంగా లాంగ్ రన్‌లో మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
