కరోనా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

| Edited By: Pardhasaradhi Peri

Feb 28, 2020 | 5:53 PM

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. కరోనా వైరస్ భయంతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడం..

కరోనా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. కరోనా వైరస్ భయంతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడం.. దేశీయంగా కీలక రంగాల షేర్లు కుదేలైన వేళ.. ఇవాళ కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 1100 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. అటు నిఫ్టీ కూడా 280 పాయింట్లు కోల్పోయి 11,319 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా భయంతో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు మదుపరులు. దీని ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందేమోనని మిగతా ఇన్వెస్టమెంటర్లను కంగారు పెట్టిస్తోంది. కాగా మెటల్, ఐటీ, రియల్ ఎస్టేట్ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్, టాటా ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.