ఈ ఇయర్‌ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇండియాలో విడుదల చేసిన సెన్‌హెయిసర్ కంపెనీ !

Sennheiser Ie900 Earphones: అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ ఇండియాలో విడుదలయ్యాయి. వీటి ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వడం ఖాయం. ప్రముఖ కంపెనీ సెన్‌హెయిసర్.. ఐఈ900 ఇన్ ఇయర్ పేరుతో ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది.

ఈ ఇయర్‌ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇండియాలో విడుదల చేసిన సెన్‌హెయిసర్ కంపెనీ !
Sennheiser Ie900 Earphones

Updated on: Jul 18, 2021 | 12:49 PM

Sennheiser Ie900 Earphones: అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ ఇండియాలో విడుదలయ్యాయి. వీటి ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వడం ఖాయం. ప్రముఖ కంపెనీ సెన్‌హెయిసర్.. ఐఈ900 ఇన్ ఇయర్ ఇయర్‌ఫోన్స్ పేరుతో విడుదల చేసింది. వీటి ధర రూ.1,29,990గా కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌ఫోన్స్ ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే మొదలైనట్లు సెన్‌హెయిసర్ కంపెనీ పేర్కొంది. కంపెనీకి సంబంధించిన వెబ్‌షాప్‌లో వీటిని ప్రీబుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ఇయరఫోన్స్‌లో సింగిల్ డ్రైవర్ సిస్టంతో విడుదల చేశారు. 7ఎంఎం రెస్పాన్స్ ట్రాన్స్‌డ్యూసర్‌పై ఈ ఇయర్‌ఫోన్స్‌ను తయారుచేశారు. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. సెన్‌హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్‌ఫోన్స్‌, హెచ్‌డీ 25 మానిటరింగ్‌ను ఇండియాలో విడుదల చేసింది. సెన్‌హెయిసర్ హెచ్‌డీ 25 బ్లూ ఇయర్ ఫోన్స్ ప్రస్తుతం అమెజాన్‌లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవి రూ.8,499లో లభిస్తున్నాయి.

మరోవైపు సెన్‌హెయిసర్ ఐఈ900 ఇన్ ఇయర్ ఇయర్‌ఫోన్స్ బరువు చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇవి మొబైల్‌‌కి కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఇవి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ (నాయిస్) ను కూడా బాగా తగ్గిస్తాయంట. దాంతో జర్సీలోనూ హ్యాపీగా మాట్లాడువోచ్చని కెంపెనీ తెలిపింది. దాదాపు 120 డెసిబిల్స్ వరకు సౌండ్‌ను ఇది తగ్గిస్తుందని అంచనా. ఆన్ ఇయర్ డిజైన్‌ విడుదలైన సెన్‌హెయిసర్ ఐఈ900 ఇన్ ఇయర్ ఇయర్‌ఫోన్స్.. ఒకవైపు క్యాప్సూల్‌ని తీసేసి ఒక చెవితో కూడా వినొచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, ఇవి కెమెరామెన్‌లు, డీజేలు ఎక్కువగా ఉపయోగిస్తారంట. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంచినట్లు సెన్‌హెయిసర్ కంపెనీ వెల్లడించింది.

Also Read:

Sanjal Gavande: నాసా వద్దన్నా.. బ్లూ ఆరిజన్‌లో దూకుడు.. అమెజాన్ రాకెట్‌ తయారీలో భారతీయ వనిత..