Salary Details: గూగుల్, మెటా సంస్థల్లో వారికే పెద్దపీట.. జీతంతో పాటు ప్రమోషన్లు కూడా..

ప్రముఖ కంపెనీలైన గూగుల్‌, మెటా కూడా సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీల కంటే ఎక్కువ జీతం చెల్లిస్తున్నాయని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ కంపెనీల్లో చేసే ఉద్యోగులకు ప్రమోషన్‌లు కూడా చాలా త్వరగా వస్తున్నాయని తెలుస్తుంది. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఎంట్రీ లెవల్ ఇంజనీర్‌లకు సగటున కనీసం చెల్లిస్తారు.

Salary Details: గూగుల్, మెటా సంస్థల్లో వారికే పెద్దపీట.. జీతంతో పాటు ప్రమోషన్లు కూడా..
salary

Updated on: Aug 30, 2023 | 5:30 PM

టెక్‌ కంపెనీల్లో సీనియర్లు అయ్యే కొద్దీ వారిని ఓ భయం వెంటాడుతూ ఉంటుంది. తమకు ఇచ్చే జీతంతో కొత్త వాళ్లు ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ జీతం ఇవ్వొచ్చనే ఉద్దేశంతో కంపెనీలు ఆలోచిస్తాయనే అనే భయం వారికి సాధారణంగా ఉంటుంది. మార్కెట్‌లోని కొన్ని కంపెనీలైతే ఈ తరహా చర్యలు పూనుకున్నాయి. అయితే కొత్త వారి పనితో పోలిస్తే అనుభవం ఉన్నవారికి కొన్ని కంపెనీలు ప్రాధాన్యతను ఇస్తాయి. వారికి ఎక్కువ జీతం కూడా చెల్లిస్తాయి. ప్రముఖ కంపెనీలైన గూగుల్‌, మెటా కూడా సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీల కంటే ఎక్కువ జీతం చెల్లిస్తున్నాయని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ కంపెనీల్లో చేసే ఉద్యోగులకు ప్రమోషన్‌లు కూడా చాలా త్వరగా వస్తున్నాయని తెలుస్తుంది. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఎంట్రీ లెవల్ ఇంజనీర్‌లకు సగటున కనీసం చెల్లిస్తారు. అయితే సీనియర్ ఇంజనీర్ల విషయానికి వచ్చే సరికి కంపెనీల అవసరాలను బట్టి వారికి చెల్లిం చే జీతం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీతం, అనుభవం ఈ రెండిటిలో కంపెనీలు దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

గూగుల్‌ కంపెనీ అత్యంత బ్యాలెన్స్‌డ్ లేదా స్థిరమైన పే బ్యాండ్‌లను కలిగి ఉంది. దీని అర్థం తక్కువ ఉద్యోగ స్థాయిలో ఉన్నవారు ఉన్నత స్థాయిలో ఉన్న వారి కంటే ఎక్కువ వేతనం పొందడం చాలా అరుదు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మెటా ఇంజనీర్లు అత్యంత వేగవంతంగా ప్రమోషన్లు పొందుతున్నారు. అలాగే ఇతర సంస్థలతో పోలిస్తే అత్యధిక వేతనాన్ని కలిగి ఉంటారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

గత సంవత్సరం జనవరి నుంచి ఈ నెల వరకు నివేదించిన పరిహారం ప్యాకేజీల ఆధారంగా ఈ డేటాను విశ్లేషించారు. అంతేకాకుండా అమెజాన్‌ ప్రమోషన్‌లు దాని తోటివారి కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే ఇంజనీర్లకు దాని చెల్లింపు శ్రేణులు విస్తృతంగా ఉన్నాయని అధ్యయన వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల కోసం అనేక ఉద్యోగ స్థాయిలను కలిగి ఉంది. ఇది కంపెనీకి మరిన్ని ప్రమోషన్‌లను ఇవ్వడానికి అనుమతించవచ్చు. మైక్రోసాఫ్ట్‌ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల కోసం అనేక ఉద్యోగ స్థాయిలను కలిగి ఉంది. ఇది కంపెనీకి మరిన్ని ప్రమోషన్‌లను అందించడానికి మరింత సౌలభ్యాన్ని ఇస్తుంది. అయినప్పటికీ స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు బోర్డు అంతటా వారి సహచరుల కంటే వారి మొత్తం పరిహారం తక్కువగా ఉంటుందని తేలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..