Samsung: శాంసంగ్‌ నుంచి సరికొత్త హోమ్‌ థియేటర్‌.. డాల్బీ అట్మాస్‌తో అదిరిపోయే సౌండ్‌

|

Jun 28, 2024 | 6:53 PM

భారతదేశంలో శాంసంగ్‌ (Samsung) తన కొత్త మ్యూజిక్ ఫ్రేమ్ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌ కొత్త హోమ్‌ థియేటర్‌లో ఆరు స్పీకర్లు ఉన్నాయి. వీటిలో అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఉన్నాయి. అలాగే, స్పీకర్ డిస్‌ప్లే సిస్టమ్‌ను కలిగి ఉంది. శాంసంగ్‌ మ్యూజిక్ ఫ్రేమ్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్‌తో వస్తుంది. ఈ ఫీచర్ 120Wతో స్పష్టమైన..

Samsung: శాంసంగ్‌ నుంచి సరికొత్త హోమ్‌ థియేటర్‌.. డాల్బీ అట్మాస్‌తో అదిరిపోయే సౌండ్‌
Samsung
Follow us on

భారతదేశంలో శాంసంగ్‌ (Samsung) తన కొత్త మ్యూజిక్ ఫ్రేమ్ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌ కొత్త హోమ్‌ థియేటర్‌లో ఆరు స్పీకర్లు ఉన్నాయి. వీటిలో అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఉన్నాయి. అలాగే, స్పీకర్ డిస్‌ప్లే సిస్టమ్‌ను కలిగి ఉంది. శాంసంగ్‌ మ్యూజిక్ ఫ్రేమ్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్‌తో వస్తుంది. ఈ ఫీచర్ 120Wతో స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. అంటే ఈ కొత్త బ్లూటూత్‌ స్పీకర్స్‌ వినియోగదారుకు అధిక-నాణ్యత ఆడియోను ఆస్వాదించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సర్వీస్‌లను కలిగి ఉంది. ఇది ట్రాక్ స్కిప్పింగ్, వాల్యూమ్ సర్దుబాటు కోసం అనుమతిస్తుంది. స్పీకర్ గది అంతటా స్థిరమైన ఆడియోను అందిస్తుంది.

మ్యూజిక్ ఫ్రేమ్ వైర్‌లెస్ స్పెసిఫికేషన్‌లు:

మ్యూజిక్ ఫ్రేమ్ శాంసంగ్ Q-Symphony టెక్నాలజీకి అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు తమ టెలివిజన్‌లకు ఇరువైపులా రెండు స్పీకర్‌లను ఉంచడం ద్వారా హోమ్ థియేటర్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా Samsung SpaceFit Sound Proలో మంచి టెక్నాలజీని అందించింది. ఇది గదికి తగినట్లుగా సౌండ్‌ను సర్దుబాటు చేసేలా డిజైన్‌ చేసింది కంపెనీ. అలాగే ఇది ఎయిర్‌ప్లే 2తో పనిచేస్తుంది. టీవీ, మ్యూజిక్ ఫ్రేమ్ రెండింటికీ రిమోట్ కంట్రోల్ స్పోర్టీ కనెక్ట్, క్రోమ్‌కాస్ట్‌తో వస్తుంది. ఇది కాకుండా Wi-Fi స్మార్ట్ కనెక్టివిటీ మెరుగైన స్మార్ట్ అనుభవాన్ని అందిస్తుంది. శాంసంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ ధర రూ.23,999. ఇప్పుడు ఇ-కామర్స్ సైట్ Amazon, Samsung ఇండియా వెబ్‌సైట్,ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

Samsung Galaxy Watch 7

Samsungలో రాబోయే గెలాక్సీ వాచ్ 7, వాచ్ అల్ట్రా టెక్ మార్కెట్‌కు గణనీయమైన అప్‌గ్రేడ్‌లను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఈ కొత్త వాచీలు అధునాతన Exynos W1000 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటాయి. ఇది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ వాచీలు రూ.10,999 నుంచి ప్రారంభమవుతాయి. అయితే కొత్త Samsung Galaxy Watch 7 ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి