
శాంసంగ్ భారత మార్కెట్‌లో తన తాజా ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S26 అల్ట్రా ధరను భారీగా తగ్గించింది. అన్ని స్టోరేజ్ వేరియంట్‌లపై రూ.9,000 తగ్గింపు ఇవ్వడంతో ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం 12GB + 256GB వేరియంట్ ధర రూ.1,30,999 కాగా, 512GB మోడల్ రూ.1,50,999, 1TB టాప్ వేరియంట్ రూ.1,80,999కు అందుబాటులో ఉంది. ఈ ధరలు గతంలో విడుదలైన గెలాక్సీ S25 అల్ట్రా స్థాయికి దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం.
ఈ తగ్గింపు తాత్కాలికమా లేదా శాశ్వతమా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ప్రస్తుతానికి కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం. అదనంగా విజయ్ సేల్స్ వంటి రిటైల్ స్టోర్లలో బ్యాంక్ ఆఫర్లతో మరింత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. HSBC, HDFC Bank, RBL Bank కార్డులపై EMI డీల్స్ ద్వారా అదనంగా వేల రూపాయల వరకు తగ్గింపు లభించవచ్చు. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే S26 అల్ట్రా టాప్-టియర్ హార్డ్‌వేర్‌తో వస్తుంది. 6.9-అంగుళాల 120Hz LTPO AMOLED డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి. కెమెరా సెటప్‌లో 200MP ప్రైమరీ సెన్సార్ సహా మల్టీ లెన్స్ వ్యవస్థ ఉంది. అదనంగా S పెన్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI కూడా దీనికి ప్రత్యేక ఆకర్షణ.
ముఖ్యంగా శాంసంగ్ ఇచ్చే ఏడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హామీ దీన్ని దీర్ఘకాలికంగా విలువైన పెట్టుబడిగా నిలబెడుతోంది. మొత్తంగా ఈ ధర తగ్గింపు తర్వాత గెలాక్సీ S26 అల్ట్రా మరింత ఆకర్షణీయమైన ఫ్లాగ్‌షిప్ ఎంపికగా మారింది. ప్రత్యేకంగా టాప్ స్పెక్స్, లాంగ్‌టర్మ్ సపోర్ట్ కోరుకునే వినియోగదారులకు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి