
కాలిఫోర్నియాలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Samsung తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Galaxy S26, Galaxy S26+ మోడళ్లను ఆవిష్కరించింది. తాజా 2nm Exynos 2600 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ ఫోన్‌లు పనితీరు, AI సామర్థ్యాలు, డిస్‌ప్లే నాణ్యతలో గణనీయమైన మెరుగుదలలను అందిస్తున్నాయని కంపెనీ తెలిపింది. కొత్త లైనప్‌లో Galaxy S26 ధర రూ.87,999 నుంచి ప్రారంభమవుతుండగా, Galaxy S26+ ధర రూ.1,19,999 నుంచి మొదలవుతుంది. రెండు ఫోన్‌లు బ్లూ, బ్లాక్, ఊదా, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. భారత్‌లో అమెజాన్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.
డిస్‌ప్లే పరంగా Galaxy S26లో 6.2 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. Galaxy S26+లో పెద్దదైన 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను అందించారు. రెండు ఫోన్‌ల స్క్రీన్‌లను కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 రక్షిస్తుంది. ఈ పరికరాలు Android 16 ఆధారిత One UI 8.5పై పనిచేస్తాయి. పనితీరు విషయంలో రెండు మోడళ్లలోనూ Exynos 2600 ప్రాసెసర్, 12GB RAM స్టాండర్డ్‌గా ఉంది. 256GB, 512GB స్టోరేజ్ ఎంపికలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. కొత్త వేపర్ చాంబర్ డిజైన్ వల్ల ఉష్ణ నియంత్రణ 29 శాతం వరకు మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది.
కెమెరా విభాగంలో రెండు ఫోన్‌లలో ఒకే ట్రిపుల్ రియర్ సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 10MP టెలిఫోటో (3x జూమ్), 12MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందుభాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఫోన్‌లు 8K, 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. బ్యాటరీ విషయంలో Galaxy S26లో 4,300mAh బ్యాటరీ ఉండగా, Galaxy S26+లో 4,900mAh బ్యాటరీ ఇచ్చారు. ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ రెండింటిలోనూ ఉంది. మొత్తంగా శక్తివంతమైన చిప్, మెరుగైన డిస్‌ప్లే, సమతుల్య కెమెరాతో కొత్త Galaxy S26 సిరీస్ ప్రీమియం విభాగంలో పోటీని మరింత కఠినతరం చేసేలా కనిపిస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి