భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ ఫోన్‌కు ఉన్నక్రేజ్ వేరు. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ మార్కెట్‌తో పాటు బడ్జెట్ రంగ స్మార్ట్‌ఫోన్స్‌లో కూడా సామ్‌సంగ్ తన హవా చూపుతుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. కంపెనీ కూడా ప్రతి ఏడాది ఎస్ సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇప్పటికే సామ్‌సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్ 24కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ నెల 17న ఎస్ 24ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫీచర్లపరంగా ఈ ఫోన్ అందరి మనన్నలు పొందుతుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్‌ను లాంచ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా ప్రీ బుకింగ్ చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కాబట్టి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం ముందస్తు రిజర్వేషన్‌ను కూడా ప్రారంభించింది. వినియోగదారులు దాని అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఫోన్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రీ-రిజర్వ్ చేయడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాలి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు రూ. 5,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు, కొనుగోలుదారులు సామ్‌సంగ్ షాప్ యాప్ కోసం ఉత్తమ అప్‌గ్రేడ్ విలువ మరియు రూ.5,000 విలువైన వెల్‌కమ్ వోచర్‌ను కూడా పొందుతారు. అయితే గెలాక్సీ ఎస్ 24 కోసం ప్రీ రిజర్వ్ చేయడానికి కస్టమర్‌లు కొన్ని ప్రాథమిక వివరాలను అందించాలి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మోడల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను గుర్తుకు తెచ్చే టైటానియం బాడీతో వచ్చే అవకాశం ఉంది. ఈ వేరియంట్ ఎస్ 24+తో ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను వస్తుంది. ఇది 200 ఎంపీ మెయిన్ లెన్స్, 10 ఎక్స్ క్వాడ్ టెలిఫోటో, 100 ఎక్స్ స్పేస్ జూమ్‌తో సహా అధునాతన కెమెరా సిస్టమ్‌ను పరిచయం చేయవచ్చు. ఎస్ 24 అల్ట్రా 6.8 అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..