ప్రముఖ దిగ్గజ కంపెనీ సామ్సంగ్ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రానిక్స్ వస్తువులకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. లేటెస్ట్ టెక్నాలజీ, ప్రత్యేక ఫీచర్లతో కాలానికి అనుగుణంగా సామ్సంగ్ తన ఉత్పత్తులను తయారు చేసి విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో పండగల సందర్భంగా తన ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు. బుక్ లు, టాబ్లెట్లు, యాక్ససరీలు, టీవీలపై భారీ డీల్, ఆఫర్లు ప్రకటించింది. సామ్సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ సేల్ పేరుతో సెప్టెంబర్ 26 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ల పై 53 శాతం వరకూ తగ్గింపు అందిస్తున్నారు. సామ్సంగ్ వెబ్ సైట్, షాప్ లు, సామ్సంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ల లో ఆయా వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఆఫర్ వర్తిస్తుంది. వీటితో పాటు ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ తో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులను వినియోగించిన వారికి క్యాష్ బ్యాక్ లు కూడా లభిస్తాయి.
ఎంపిక చేసిన గెలాక్సీ జెడ్, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై దాదాపు 53 శాతం వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్మార్ ఫోన్ కొనుగోలుపై గెలాక్సీ బడ్స్ ఎఫ్ ఈ ఈయర్ బడ్స్ ను రూ.1249 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6, ఎస్ 24 సిరీస్, ఎస్ 23 సిరీస్, ఏ 55, ఏ 35, ఎం 35, ఎం15, ఎఫ్ 55 స్మార్ట్ ఫోన్లకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఎంపిక చేసిన గెలాక్సీ బుక్ 4 సిరీస్ వస్తువులపై దాదాపు 27 శాతం తగ్గింపు ప్రకటించారు. గెలాక్సీ బుక్ 4 మోడల్ ను కొనుగోలు చేసిన వారు రూ.1920 తగ్గింపు ధరతో ఎఫ్ హెచ్ డీ ప్లాట్ మానిటర్ పొందవచ్చు. గెలాక్సీ బుక్ 4 ప్రో 360, 4 ప్రో, 4 360, గెలాక్సీ బుక్ 4 పై ఆఫర్లు ఉన్నాయి.
మినీ లాప్ ట్యాప్ లుగా భావించే టాబ్లెట్లపై కూడా సామ్సంగ్ ఆఫర్లు ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్ ఏ9, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 మోడళ్లు 74 శాతం డిస్కౌంట్ పై అందుబాటులోకి రానున్నాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10, ఎస్ 9, ఎస్ 9 ఎఫ్ ఈ, ఏ9 సిరీస్ పై ఆఫర్ అందజేస్తున్నారు.
గెలాక్సీ వాచ్ 7 సిరీస్, వాచ్ అల్ట్రా, వాచ్ ఎఫ్ ఈ, గెలాక్సీ బడ్స్ 3, 3 ప్రో, ఎఫ్ ఈ, ఫిట్ 3 వాచ్ లు, ఇయర్ బడ్స్ డిస్కౌంట్ పై అందుబాటులోకి రానున్నాయి.
అలాగే ఎంపిక చేసిన సామ్సంగ్ టెలివిజన్లపై 43 శాతం తగ్గింపు ప్రకటించారు. ది ప్రేమ్ స్పీకర్లు, ప్రీ స్లైల్ ప్రాజెక్టర్ తదితర పరికరాలు ఈ జాబితాలో ఉన్నాయి. సామ్సంగ్ 55 అంగుళాల టీవీ మోడల్, అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి సామ్సంగ్ టెలివిజన్ లేదా సౌండ్ బార్ అందజేస్తారు. ఎంపిక చేసిన 32 అంగుళాల టీవీలపై మూడేళ్ల సమగ్ర వారంటీ అందిస్తారు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రో వేవ్ లు, మానిటర్లపై కూడా డిస్కౌంట్ ఉంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..