Rocket vs Helicopter: హెలికాప్టర్ అద్భతంగా రాకెట్‌ను క్యాచ్ పట్టుకుంది. అదేంటి క్యాచ్ పట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్‌ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ఒక ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ ఈ రాకెట్ ల్యాబ్‌ని నిర్వహిస్తున్నాడు.
న్యూజిల్యాండ్‌లో ఈ నెల 04వ తేది ఉదయం 10.50 నిమిషాలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్ రాకెట్ ఆకాశంలో ఒకనొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత భూమ్మీద పడిపోబోతోంది. అదే సమయంలో న్యూజిలాండ్ తీరంలో సౌత్ పసిఫిక్‌కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్ రాకెట్‌ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్‌ని వదిలింది. హెలికాప్టర్ పారాచూట్, కేబుల్ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్ పసిఫిక్ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది.
This is what it looked like from the front seats. pic.twitter.com/AwZfuWjwQD
— Peter Beck (@Peter_J_Beck) May 3, 2022