
దేశంలో ఎయిర్ పోర్టులలో రాను రాను రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అని తేడా లేకుండా ప్రయాణికులు ఫ్లైట్లపై బాగా ఆధారపడ్డారు. ఎయిర్ పోర్టు మెయింటెనెన్స్ కూడా రోజురోజుకు కష్టంగా మారుతుంది. దీంతో టెక్నాలజీ వైపు దృష్టి పెట్టాయి ఎయిర్‌పోర్ట్ ఏజెన్సీలు. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోలను రంగంలోకి దింపాయి. తాజాగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ రోబోలు దర్శనమిచ్చాయి. చాలా విచిత్రంగా ఎవరో రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చేస్తున్నట్లుగా శ్రద్ధగా పనిచేస్తున్న ఈ రోబోను చూసి వివరాలు అడిగితే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ మొత్తం ఒక్కసారి మ్యాపింగ్ చేసి ఇస్తే, ఇక ప్రతి కార్నర్ తిరిగి క్లీన్ చేస్తుంది. ఇందులో ఎక్కడ చెత్త ఎక్కువగా వేస్తున్నారు. ఎక్కడ తడిగా ఉంది అని దానంతట అదే తెలుసుకునే టెక్నాలజీ ఉంది. తిరుగుతున్నప్పుడు మనుషులు అడ్డు వస్తే, వెంటనే సెన్సార్ల ద్వారా ఆగిపోయి, మరోవైపునకు మళ్ళిపోతుంది. విచిత్రంగా ప్రైవేటు షాపులు, లీవ్ ఇచ్చిన ప్రాంతాల్లో ఇది క్లీన్ చేయదు. కేవలం ఎయిర్‌పోర్ట్ ప్రోగ్రామింగ్ చేసిన పరిధిలో మాత్రమే శుభ్రం చేస్తుంది.
ఇందులో వెట్ అండ్ డ్రై రెండు ఇందులో ఉన్నాయి. ఎక్కడైనా తడిగా కనిపిస్తే వెంటనే ఈ రోబో లో ఉన్న ఎయిర్ డ్రాయర్ తో ఆరబెట్టేస్తుంది. ఇంకా ఎక్కువగా నీళ్లు కనబడితే పీల్చేస్తుంది. ప్లాస్టిక్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్స్ కనిపిస్తే వెంటనే పికప్ చేస్తుంది. అంతేకాదు కాయిన్స్, గోల్డ్, వాలెట్ లాంటి విలువైన వస్తువులు ఈ రోబోకు దొరికితే వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి సమాచారం చేస్తుంది. ఇందులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. చార్జింగ్ అయిపోగానే దానంతట అదే చార్జింగ్ పోర్టు వద్దకు వెళ్లి చార్జ్ చేసుకుంటుంది. రెస్ట్ లేకుండా 24 గంటలు పనిచేయడం ఈ రోబో ప్రత్యేకత..!
వీడియో చూడండి..
అయితే ఈ రోబో వల్ల ఆరుగురు హౌస్ కీపింగ్ వర్కర్లకు పని లేకుండా పోయిందనేదే బాధాకరం..! అంతకుముందు ఎయిర్‌పోర్టులోని ఒక ఫ్లోర్‌ను ఆరుగురు వర్కర్లు నిరంతరం క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆరుగురు పని ఈ రోబో మాత్రమే చేస్తుంది. ఎయిర్‌పోర్ట్ ఏజెన్సీకి పని సులువైన ఆరుగురు పని కోల్పోవడం ఇబ్బందే.. చూడాలి మరీ, ముందు ముందు ఈ రోబో ఎంత మందిని ఉద్యోగాల్లో నుంచి ఊడగొడుతుందో..!
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..