రిలయన్స్ జియో ఎట్టకేలకు ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. జియోబుక్ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. గతంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రకటించిన విధంగానే రియలన్స్ జియో బుక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్ తొలిసేల్‌ను ప్రారంభించనున్నారు. రిలయన్స్ డిజిటల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ జియోబుక్ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎలా ఉండనుంది.? లాంటి వివరాలు మీకోసం..
జియోబుక్ ల్యాప్‌టాప్‌లో 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 11.6 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. Adreno 610 GPU స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్ ద్వారా ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ వంటి శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 4జీ సిమ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫీచర్‌ను అందించారు. వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
2 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ జియో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక కనెన్టివిటీ విషయానికొస్తే.. ఇందులో యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ అందించారు. బ్లూటూత్, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ ల్యాప్ టాప్ ప్రారంభం ధర రూ. 15,799గా ఉండనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..