భారతదేశంలో బడ్జెట్ 4G ఫోన్‌ను పరిచయం చేసిన తర్వాత, రిలయన్స్ జియో ప్రస్తుతం మరో సంచలనానికి తెర లేపనుంది. తన మొదటి తక్కువ-ధర ల్యాప్‌టాప్‌ను మార్కెట్ లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ దీనికి JioBook అని పేరు పెట్టింది. ఈ ల్యాప్‌టాప్ అక్టోబర్ 2022లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ 4G తో రానుంది. JioBook కోసం Qualcomm (QCOM.O), Microsoftతో భాగస్వామ్యం కలిగి ఉంది. జియో ల్యాప్‌టాప్ ధర 184 డాలర్లు అంటే దాదాపు రూ. 15,000 అని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, JioBook అక్టోబర్ 2022 నాటికి పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలలో పని చేసే వినియోగదారులకు అందుబాటులో తేనుందంట. దీని తర్వాత వచ్చే మూడు నెలల్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో Jio 4G ఎంబెడెడ్ SIM కార్డ్‌తో కొత్త JioBookని లాంచ్ చేస్తుంది. ఆ తర్వాత దాని 5G వెర్షన్ ప్రారంభించనున్నారు. Jio 5G ఫోన్ లాంచ్ అయిన తర్వాత JioBook 5G వేరియంట్ వస్తుందని భావిస్తున్నారు.
స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే, JioBook ఆర్మ్ లిమిటెడ్ టెక్నాలజీ ప్రాసెసర్ చిప్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఈ ల్యాప్‌టాప్ JioOS, Windows OSలో రన్ అవుతుంది. JioBook భారతదేశంలో Flex ద్వారా తయారు చేస్తున్నారు.
ధర రూ. 15000ల లోపే..
బడ్జెట్ ల్యాప్‌టాప్‌ల ప్రస్తుత మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, వినియోగదారులు రూ. 20,000 లోపు ఎంపికలను పొందడం లేదు. HP 14Q-CY0005AU, Asus-E203MAH, Lenovo Ideapad 130 APU Dual-Core A6లతోపాటు ఇతర ల్యాప్‌టాప్‌లు రూ. 20,000లుగా ఉన్నాయి. కాగా, JioBook ప్రారంభించడంతో చాలా కంపెనీలు దాదాపు 15,000 రూపాయలతో ల్యాప్‌టాప్‌లను తయారు చేసేందుకు పోటీపడనున్నట్లు భావిస్తున్నారు.