Valentine’s Day: జియో వాలెంటైన్స్ డే బంపర్ ఆఫర్.. ఫ్రీ ఇంటర్నెట్, మెక్‌డొనాల్డ్స్ ఫుడ్.. ఇక పండగే పండగ..

|

Feb 13, 2023 | 5:41 PM

వాలెంటైన్స్ డే సందర్భంగా భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెలికాం కంపెనీ రిలయన్స్ జియో.. వాలెంటైన్స్ డే 2023 సందర్భంగా..

Valentines Day: జియో వాలెంటైన్స్ డే బంపర్ ఆఫర్.. ఫ్రీ ఇంటర్నెట్, మెక్‌డొనాల్డ్స్ ఫుడ్.. ఇక పండగే పండగ..
Jio Offers Valentine's Day
Follow us on

వాలెంటైన్స్ డే సందర్భంగా భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెలికాం కంపెనీ రిలయన్స్ జియో.. వాలెంటైన్స్ డే 2023 సందర్భంగా తన వినియోగదారుల కోసం జియో ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించింది. Jio ప్రకటించిన ఈ ఆఫర్ కింద వినియోగదారులు ఎవరైనా రూ.349, రూ.899 లేదా రూ.2999 జియో ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే వినియోగదారుడు అదనపు డేటా, చెల్లుబాటుతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారులు ఎంచుకున్న ప్లాన్‌లకనుగుణంగా ఈ ప్రయోజనాలను పొందవచ్చని జియో ప్రకటించింది.

జియో వాలెంటైన్స్ డే ఆఫర్..

Jio ఆఫర్‌తో వినియోగదారులు రూ.199 కొనుగోలుపై రూ.105, ఫెర్న్స్‌లో రూ.799 కొనుగోలు చేస్తే రూ.150, 75 జీబీ హై-స్పీడ్ డేటా, 12 జీబీ హై-స్పీడ్ డేటా, మెక్‌డొనాల్డ్ మెక్‌ఆలూ టిక్కీ/చికెన్ కబాబ్ బర్గర్ రూ.105 ఉచితంగా లభిస్తాయి. ఇక్సిగో నుంచి రూ.4500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై పెటల్స్ ఫ్లాట్ పై రూ.750 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

జియో 349 ప్లాన్ వివరాలు

Reliance Jio ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2.5 GB హై-స్పీడ్, అపరిమిత లోకల్, STD కాలింగ్, రోజుకు 100 SMSలు ప్రతిరోజూ అందుతాయి. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 12 GB అదనపు డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

జియో 899 ప్లాన్ వివరాలు..

899 రూపాయల ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌తో 2.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజువారీ 100 SMS సౌకర్యాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కూడా, కంపెనీ వినియోగదారులకు ఇతర ప్రయోజనాలతో పాటు 12 GB అదనపు డేటాను అందిస్తోంది.

జియో 2999 ప్లాన్ వివరాలు..

ఈ ప్లాన్‌తో, మీరు రోజుకు 2.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల చెల్లుబాటుతో పొందుతారు. వాలెంటైన్స్ డే ఆఫర్ కింద, ఈ ప్లాన్ 23 రోజుల అదనపు చెల్లుబాటుతోపాటు 75GB అదనపు డేటా, మెక్‌డొనాల్డ్స్, ఫెర్న్ & పెటల్‌తో 12GB అదనపు డేటా, విమాన బుకింగ్‌లపై రూ. 750 తగ్గింపును అందిస్తోంది.

Jio Valentine’s Day

మరిన్ని వివరాల కోసం రిలయన్స్ జియో వైబ్‌సైట్‌ లేదా.. జియో ఆప్‌లో సందర్శించండి..

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..