AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioBharat: దీపావళికి జిగేల్‌మనే ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌..

ప్రముఖ టెలికం సంస్థ జియో గతంలో జియో భారత్ పేరుతో ఫోన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ 4జీ ఫోన్ పై రిలయన్స్ మంచి ఆఫర్ ను అందిస్తోంది. జియో భారత్ ఫోన్ పై 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతో లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

JioBharat: దీపావళికి జిగేల్‌మనే ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌..
Jio Bharat
Narender Vaitla
|

Updated on: Oct 28, 2024 | 5:32 PM

Share

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ జియో బంపరాఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ. 700కే 4జీ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై జియో ఏకంగా 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. జియో భారత్‌ ఫోన్‌పై రిలయన్స్‌ సంస్థ అందిస్తోన్న ఆఫర్‌ ఏంటి.? ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్‌ ఫోన్స్‌ యూజర్లను టార్గెట్ చేసుకొని రిలయన్స్‌ జియో.. గత కొన్ని రోజుల క్రితం జియో భారత్‌ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లాంచింగ్‌ సమయంలో ఈ ఫోన్‌ ధరను రూ. 999గా నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం పండుగ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 699కే సొంతం చేసుకోవచ్చు.

ఇక నెలవారీ రీఛార్జ్‌ విషయంలో కూడా ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌ను అందిస్తోంది. ప్రతీ నెల కేవలం రూ. 123తో రీఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా నెలరోజుల పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ పొందొచ్చు. అదే విధంగా 14 జీబీ డేటాను పొందొచ్చు. తక్కువ బడ్జెట్‌లో 4జీకి అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న వారికి జియో భారత్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే జియో భారత్‌ ఫోన్‌లో లైవ్‌ టీవీ చూడొచ్చు. 455 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. డిజిటల్‌ చెల్లింపులు కూడా చేసుకునే వీలు ఉండడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా పేమెంట్స్‌ చేసుకోచ్చు. జియోపే ద్వారా పేమెంట్స్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో జియోపే, జియోఛాట్‌ వంటి ప్రీలోడెడ్‌ యాప్‌లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. జియో మార్ట్‌ యాప్‌కు కూడా ఈ ఫోన్‌ పోర్ట్‌ చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి