Jio: జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్.. రూ. 75 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్‌.

టెలికాం రంగంలో సరికొత్త ఒరవడితో దూసుకొచ్చిన రియలన్స్‌ జియో యూజర్లను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌తో వస్తోంది. ప్రత్యర్థి కంపెనీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో యూజర్లను చేజారి పోకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తక్కువ..

Jio: జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్.. రూ. 75 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్‌.
Jio App

Updated on: Feb 23, 2023 | 8:10 AM

టెలికాం రంగంలో సరికొత్త ఒరవడితో దూసుకొచ్చిన రియలన్స్‌ జియో యూజర్లను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌తో వస్తోంది. ప్రత్యర్థి కంపెనీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో యూజర్లను చేజారి పోకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తక్కువ మొత్తంలో ప్లాన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనేగా తాజాగా రూ.75 ప్లాన్‌తో ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది జియో.

అయితే ఈ ప్లాన్‌ కేవలం జియో ఫోన్‌ ఉపయోగించే వారికి మాత్రమే. ఇతర ఫోన్‌లలో జియో సిమ్‌ వాడుతున్న వారికి ఈ ఆఫర్‌ వర్తించదు. ఇక ఈ ప్లాన్‌ వివరాల విషయానికొస్తే 23 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను అందిస్తున్నారు. 23 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను పొందొచ్చు. దీంతో పాటు మొత్తం 2.5 జీబీ డేటాను అందిస్తారు. రోజుకు 100 ఎంబీ డేటా ఈ ప్లాన్‌ ద్వారా పొందొచ్చు. వీటితో పాటు మరికొన్ని బెనిఫిట్స్‌ను సైతం అందిస్తున్నారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

డేటా, టాక్‌ టైమ్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లను సైతం ఈ ప్లాన్‌ ద్వారా అందిస్తున్నారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారు మొత్తం 50 SMSలను కూడా పంపించుకోవచ్చు. అంతేకాకుండా జియో సినిమా, జియో టీవీలతో పాటు మరికొన్ని యాప్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..