Redmi Note 11 Pro Series: రెడ్‌మీ నోట్‌ 11 ప్రో వచ్చేస్తోంది. ఫీచర్స్‌ అదుర్స్‌..!

| Edited By: Venkata Chari

Mar 09, 2022 | 3:54 PM

Redmi Note 11 Pro Series: షియోమీ ఇండియాలో రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది.  అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఈ సిరీస్ ఫోన్ ను మార్కెట్లో విడుదల..

Redmi Note 11 Pro Series: రెడ్‌మీ నోట్‌ 11 ప్రో వచ్చేస్తోంది. ఫీచర్స్‌ అదుర్స్‌..!
Redmi Note 11 Pro Series
Follow us on

Redmi Note 11 Pro Series: షియోమీ ఇండియాలో రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది.  అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఈ సిరీస్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేయనుంది. Xiaomi సబ్-బ్రాండ్ Redmi భారతదేశంలో ప్రో సిరీస్‌ నుంచి రెడ్‌మీ నోట్‌11ప్రోను మార్చి 9న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో ఆవిష్కరణ కానుంది. అయితే కంపెనీ తన రెండు కొత్త ఫోన్‌లను Redmi Note 11 Pro, Redmi Note 11 Pro + 5G ని విడుదల చేయనుంది. Redmi Note 11 Proలో MediaTek Helio G96 చిప్‌సెట్‌ ఉండనుంది. అయితే Redmi Note 11 Pro + 5G సూపర్-ఫాస్ట్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. శక్తివంతమైన చిప్‌సెట్, RAMతో పాటు అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20 వేల లోపు ఉండే అవకాశం ఉంది. అందులో అనేక ఫీచర్స్‌ను పొందుపర్చింది కంపెనీ.

Redmi Note 11 Pro, Note 11 Pro+ ఫీచర్లు :

Redmi Note 11 Pro గ్లోబల్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67 ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 6GB/8GB RAM, 64GB/128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. MediaTek Helio G96 చిప్‌సెట్ అందిస్తోంది. ఈ ఫోన్‌లోని క్వాడ్ వెనుక కెమెరా 108-MP ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రావైడ్ లెన్స్, 2-MP డెప్త్ సెన్సార్ 2-MP మాక్రో కెమెరాను కలిగి ఉండనుంది. ఫ్రంట్ సైడ్ 16-MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తోంది. Redmi Note 11 Pro Android 11-ఆధారిత MIUI 13 స్కిన్‌ ఇంటర్ ఫేస్‌తో రానుంది. ఈ సీరిస్‌ ఫోన్‌లో 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ రీడింగ్ మోడ్ 3.0 ఉంది. మొబైల్ స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రకాశవంతమైన కాంతిలో చదవడం సులభతరం చేస్తుంది. దీని డిస్‌ప్లే కాంతితో కళ్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. Redmi Note 11 Pro + 5Gలో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఈ టెక్నాలజీ వేడిని తరిమికొట్టి కూలింగ్‌ చేయనుంది. Redmi Note సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించబడింది. భారతదేశంలోనే 67 మిలియన్లకు పైగా విక్రయించబడింది.

Pro+ మోడల్‌లో ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 695 చిప్ 5G కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. కెమెరా సిస్టమ్ 3 సెన్సార్‌లతో మాత్రమే రానుంది. Redmi Note 11 Pro+ Redmi Note 11 Pro రెండు ఫోన్ల ధర రూ.20వేల లోపు ఉండవచ్చునని అంచనా. మార్చి 9న విడుదల అయ్యాక ఈ రెండు మోడళ్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంత అనేది క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి:

Google Images: మీకు గూగుల్‌లో కావాల్సిన ఫోటోలు దొరకడం లేదా..? ఇలా చేయండి..!

AYYA T1 Smartphone: యాపిల్‌ ఫోన్‌కు ధీటుగా రష్యా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..!