Redmi Note 10 Series: ఇప్పుడున్న రోజుల్లో మొబైల్ లేనివారుండరు. ఇక వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. రోజురోజుకు కొత్త ఫీచర్లతో అద్భుతమైన ఫోన్లు మార్కెట్లోకు విడుదలవుతున్నాయి. అయితే భారత మార్కెట్లో రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌తో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సదరు సంస్థ తెలిపింది.
ఈ నేపథ్యంలో రెడ్‌మి నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఓ టీజర్‌ను షియోమి విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 ఎస్‌వోసీ, 120Hz LCD డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్, 64 మెగాఫిక్సల్ కెమెరా, 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను బుధవారం ఉదయం 10 గంటలకు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సంస్థ తెలిపింది.