Redmi Note 11 Pro: రెడ్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. 108 మెగా పిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..

| Edited By: Ravi Kiran

Mar 12, 2022 | 3:36 PM

Redmi Note 11 Pro: స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone) రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం Redmi తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది....

Redmi Note 11 Pro: రెడ్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. 108 మెగా పిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..
Redmi Note 11 Pro
Follow us on

Redmi Note 11 Pro: స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone) రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం Redmi తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను పరిచయం చేస్తూ వస్తోన్న Redmi.. Redmi Note 11 Pro సిరీస్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఎఫ్‌హెచ్‌డీ+ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లేను 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, డీసీఐ-పీ3 కలర్‌ గముట్‌తో కూడిన 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను ఇచ్చారు. ఇక డిస్‌ప్లేకు ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5ను ఇచ్చారు. మార్చి 11న లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో పాగా వేసే క్రమంలో తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్లు రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్నాయి. ఈ Redmi note 11 pro స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ మరో ప్రత్యేకత. కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే Redmi Note 11 Pro ప్రారంభ ధర రూ. 17,999కాగా, Redmi Note 11 Pro Plus 5జీ ఫోన్‌ ధర రూ. 19,999గా ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 67 వాట్స్‌ చార్జింగ్ సపోర్ట్ చేసే 500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 50 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 15 నిమిషాల్లో, 42 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తి కావడం ఈ స్మార్ట్‌ ఫోన్‌ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎమ్‌ఐ అధికారిక వెబ్‌సైట్‌ mi.comతో పాటు, amzon.inలో అందుబాటులో ఉండనుంది.

Also Read: Health Tips: దంత సమస్యలుంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే.

Ukraine Crisis Updates: రష్యా యుద్ధోన్మాదం.. దేశం వీడుతున్న లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు.. యూరప్ దేశాల్లో అణుభయాలు..

Crypto Fraud: హైదరాబాదీకి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ.. క్రిప్టో పెట్టుబడుల పేరుతో దోచేశారు..