Realme Narzo N55: నార్జో సిరీస్‌లో రియల్ మీ కొత్త ఫోన్.. ఆకట్టుకునే డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్లు

|

Apr 13, 2023 | 4:30 PM

రియల్ మీ నార్జో ఎన్55 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రియల్ మీ కంపెనీ గత నెలలో సీ 55ను రిలీజ్ చేసింది. తాజాగా నార్జో ఎన్ 55ను రిలీజ్ చేయడంతో టెక్ నిపుణులు ఈ ఫోన్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు.

Realme Narzo N55: నార్జో సిరీస్‌లో రియల్ మీ కొత్త ఫోన్.. ఆకట్టుకునే డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్లు
Realme Narzo N55
Follow us on

భారత్‌లో విపరీతంగా ఉన్న స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వివిధ మోడల్స్‌లో ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ల రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ రిలీజ్ చేస్తున్న నార్జో సిరీస్ ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కంపెనీ నార్జో సిరస్‌లో మరో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. రియల్ మీ నార్జో ఎన్55 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రియల్ మీ కంపెనీ గత నెలలో సీ 55ను రిలీజ్ చేసింది. తాజాగా నార్జో ఎన్ 55ను రిలీజ్ చేయడంతో టెక్ నిపుణులు ఈ ఫోన్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఫోన్ ఛార్జింగ్ స్థితి, లో బ్యాటరీ హెచ్చరిక, డేటా వినియోగం, అలాగే స్టెప్స్, రోజుకు నడిచే దూరం వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ రియల్‌మీ నార్జో ఎన్ 55 ఫోన్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంటుంది. అలాగే 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అలాగే 6 జీబీ+128 జీబీ ధర రూ.12,999గా ఉంటుంది. ఈ ఫోన్ రియల్ మీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు లభిస్తుంది. 

రియల్ మీ నార్జో ఎన్ 55 స్పెసిఫికేషన్లు ఇవే

  • 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 680 నిట్స్ బ్రైట్‌నెస్
  • ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ88 12 ఎన్ఎం ప్రాసెసర్ 
  • 4 జీబీ+ 64 జీబీ, 6 జీబీ+128 జీబీ వేరియంట్లు
  • డ్యూయల్ సిమ్‌తో పాటు రియల్‌మీ యూఐ 4.0 సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13 సపోర్ట్
  • 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..