స్మార్ట్​ఫోన్‌ను నాలుగుసార్లు ఛార్జ్‌ చేసుకునే పవర్ బ్యాంక్ వచ్చేసింది.. రియల్‌మీ టెక్‌లైఫ్​ ధర ఎంతంటే?

ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ అయిపోతే ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సమయంలో మంచి కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది. Realme Techlife 20000mAh మోడల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ వంటి పరికరాలకు బ్యాకప్ అందించేలా రూపొందించారు.

స్మార్ట్​ఫోన్‌ను నాలుగుసార్లు ఛార్జ్‌ చేసుకునే పవర్ బ్యాంక్ వచ్చేసింది.. రియల్‌మీ టెక్‌లైఫ్​ ధర ఎంతంటే?
Realme Techlife 20000mah Power Bank

Updated on: Oct 05, 2026 | 8:15 PM

స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ వంటి గ్యాడ్జెట్ల వినియోగం పెరగడంతో పవర్ బ్యాంక్ అవసరం కూడా పెరిగింది. ముఖ్యంగా తరచూ ప్రయాణాలు చేసేవారికి బ్యాటరీ బ్యాకప్ పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో Realme Techlife 20000mAh పవర్ బ్యాంక్ భారీ కెపాసిటీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాకప్ కోరుకునేవారిని లక్ష్యంగా చేసుకున్న ఈ మోడల్‌లో ఫోన్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్లను కూడా ఛార్జ్ చేసుకునే సదుపాయం ఉంది. స్టైలిష్ డిజైన్, సేఫ్టీ ఫీచర్లు కూడా దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

20000mAh బ్యాటరీ..

Realme Techlife పవర్ బ్యాంక్‌లో 20000mAh బ్యాటరీ ఉంటుంది. దీనితో స్మార్ట్‌ఫోన్‌ను సుమారు 3 నుంచి 4 సార్లు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, కుటుంబ విహారయాత్రలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో సాధారణ పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే అనుకూలమైన పరికరాలను వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఫోన్‌తో పాటు టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. చిన్న పరికరాల కోసం లో-కరెంట్ మోడ్ కూడా అందించారు.

సేఫ్టీ ప్రొటెక్షన్

సాధారణ పవర్ బ్యాంక్‌లకు భిన్నంగా Realme ఈ మోడల్‌ను Amber Yellow రంగులో తీసుకొచ్చింది. కాంపాక్ట్ డిజైన్ కారణంగా బ్యాగ్‌లో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఓవర్‌ఛార్జింగ్, ఓవర్‌హీటింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించే మల్టిపుల్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ధర సుమారు రూ.1,999గా ఉండటం మరో ఆకర్షణ. భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునేవారికి ఈ Realme పవర్ బ్యాంక్ ఉపయోగకరమైన ఎంపికగా కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us